
📌 Key Points
- రామ్ చరణ్, సుకుమార్ల RC17 రెగ్యులర్ షూటింగ్ జూన్ నుండి ప్రారంభం.
- మైత్రీ మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ నుండి అధికారిక అప్డేట్.
- ‘రంగస్థలం’ తర్వాత రాబోతున్న ఈ క్రేజీ కాంబోపై భారీ అంచనాలు.
- ప్రస్తుతం ‘పెద్ది’ షూటింగ్ పూర్తి చేసుకుంటున్న మెగా పవర్ స్టార్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పండగ లాంటి వార్త! RC17పై అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. దర్శకుడు సుకుమార్‌తో రామ్ చరణ్ చేయబోయే తదుపరి ప్రాజెక్టుపై మైత్రీ మూవీ మేకర్స్ సీఈఓ అదిరిపోయే క్లారిటీ ఇచ్చారు. ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు!
RC17: సుకుమార్, చరణ్ కాంబో మళ్ళీ!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాతో బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ జూన్‌లో రిలీజ్‌కు సిద్ధం అవుతుండగా షూటింగ్‌లో వేగం పెంచారు చిత్ర బృందం. ఇక రెండు, మూడు రోజుల్లో షూటింగ్, ఎడిటింగ్ పనులు పూర్తి కావొస్తాయని తెలుస్తుండగా.. ఇంతలోనే తన తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టేశాడు చర్రి. పెద్ది తర్వాత రామ్ చరణ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ‘RC 17’ చేయబోతున్న విషయం తెలిసిందే. ‘రంగస్థలం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలోవస్తున్న ఈ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ప్రస్తుతం సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉండగా.. తాజాగా షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ మేరకు ‘RC 17’ షూటింగ్ రెగ్యూలర్ షూటింగ్ జూన్ నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు మైత్రీ సీఈఓ చెర్రీ తెలిపారు. ప్రజెంట్ఈ న్యూస్ వైరల్ అవుతుండగా.. మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవదులు లేకుండా పోతుంది.
జూన్ నుంచే సెట్స్ పైకి RC17!
మైత్రీ సీఈఓ నుండి మాస్ అనౌన్స్‌మెంట్!
RC17పై వచ్చిన ఈ తాజా అప్డేట్‌తో మెగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. రామ్ చరణ్, సుకుమార్ కాంబో మ్యాజిక్ కోసం ప్రేక్షకులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని సంచలన అప్డేట్స్‌తో మీ ముందుకు వస్తాం. వేచి ఉండండి!


