|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ram Charan: రామ్ చరణ్ టాలెంట్‌ను సరిగ్గా వాడుకోలేదు అదే నా బాధ.. ఇష్యూపై తమన్ క్లారిటీ

Published: 29-09-2025, 10:38 AM
Ram Charan: రామ్ చరణ్ టాలెంట్‌ను సరిగ్గా వాడుకోలేదు అదే నా బాధ.. ఇష్యూపై తమన్ క్లారిటీ

మ్యూజిక్ డైరెక్టర్ తమన్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య నెలకొన్న వివాదంపై స్పందించారు. ‘గేమ్ చేంజర్’ పాటల విషయంలో చరణ్ డ్యాన్స్ టాలెంట్‌ను పూర్తిగా వినియోగించుకోలేదన్నదే తన ఆవేదన అని తమన్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు.

Key Points

1

తమన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

2

‘గేమ్ చేంజర్’ పాటల్లో హుక్ స్టెప్పులు లేవని తమన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

4

రామ్ చరణ్ మంచి వ్యక్తి, ‘ఓజీ’ మ్యూజిక్ గురించి కూడా తమన్‌తో మాట్లాడారు.

తమన్ వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఆగ్రహం

మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌పై ప్రజెంట్ రామ్ చరణ్ ఫ్యాన్స్ పలువురు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ ‘గేమ్ చేంజర్’ పాటలకు హుక్ స్టెప్పులు లేవంటూ అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఆ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన కామెంట్స్‌ను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు తమన్. ‘రామ్ చరణ్ పెద్ద డ్యాన్సర్. తొలి సినిమాతో మొదలు ‘నాయక్‌లోని లైలా ఓ లైలా’, బ్రూస్‌లీ లోని మెగా మెగా మీటర్ లాంటి ఎన్నో పాటలకు అద్భుతమైన స్టెప్పులేసి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు చర్రీ.

అలాంటి ఆయన ఎనర్జీకి కొరియోగ్రాఫర్లు సరైన మూమెంట్స్ ఇవ్వలేకపోయారని ఇటీవల అన్నాను. ఆ కామెంట్స్‌ను కొందరూ హీరోని టార్గెట్ చేసి మాట్లాడానని తప్పుగా అర్థం చేసుకున్నారు. ‘గేమ్ చేంజర్’ విషయంలో రామ్ చరణ్ డ్యాన్స్ టాలెంట్‌ను సరిగ్గా వాడుకోలేకపోయాన్నదే నా బాధ.. అంతే కానీ వేరే ఉద్దేశ్యంతో నేను అనలేదు. రామ్ చరణ్ చాలా మంచి వ్యక్తి. అందుకే ఆయన్ని నేను మెగా హార్ట్ స్టార్ అని పిలుస్తాను. ఓజీ మ్యూజిక్ గురించి కూడా రామ్ చరణ్ నాతో ప్రత్యేకంగా మాట్లాడారు’ అంటూ తెలిపాడు తమన్.

‘గేమ్ చేంజర్’ డ్యాన్స్ టాలెంట్‌పై తమన్ స్పష్టత

రామ్ చరణ్‌తో తమన్ ప్రత్యేక చర్చ

తమన్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వడంతో, రామ్ చరణ్ అభిమానుల అపోహలు తొలగిపోయే అవకాశం ఉంది. రామ్ చరణ్ పట్ల తమన్‌కు ఉన్న గౌరవం, వారిద్దరి మధ్య ఉన్న మంచి సంబంధాన్ని ఇది స్పష్టం చేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.