|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చరణ్ బాబు ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను-తండ్రి చిరంజీవి స్పెషల్ పోస్ట్- రామ్ చరణ్ 18 ఏళ్ల సినీ కెరీర్-పెద్ది పోస్టర్

Published: 28-09-2025, 6:45 AM
చరణ్ బాబు ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను-తండ్రి చిరంజీవి స్పెషల్ పోస్ట్- రామ్ చరణ్ 18 ఏళ్ల సినీ కెరీర్-పెద్ది పోస్టర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ ప్రస్థానంలో 18 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ చేశారు. అప్ కమింగ్ మూవీ ‘పెద్ది’ నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ ప్రత్యేకమైన రోజున అభిమానులు, సినీ ప్రముఖులు చరణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Key Points

1

రామ్ చరణ్ సినీ రంగంలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.

2

తండ్రి చిరంజీవి తన కొడుకుపై ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

4

రామ్ చరణ్ 'పెద్ది' మూవీ నుంచి మాస్ లుక్‌లో పోస్టర్ రిలీజ్.

చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ఇవాళ ప్రత్యేకమైన రోజు. 2007లో సెప్టెంబర్ 28నే రామ్ చరణ్ ఫస్ట్ మూవీ ‘చిరుత’ రిలీజైంది. ఆ రోజు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చెర్రీ ఇప్పుడు 18 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ రోజు (సెప్టెంబర్ 28)తో 18 ఏళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్నాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా అతని తండ్రి, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారు.

రామ్ చరణ్ 18 ఏళ్ల సినీ కెరీర్ కంప్లీట్ అయిన నేపథ్యంలో చిరంజీవి ఎమోషనల్ పోస్టు పెట్టారు. చెర్రీని హీరోగా తెరపై చూసిన క్షణం ఎప్పటికీ మరచిపోలేనని ఎక్స్ లో పేర్కొన్నారు చిరంజీవి. పెద్ది మూవీ పోస్టర్ ను రీ షేర్ చేస్తూ చిరు స్పెషల్ కామెంట్లు చేశారు.

రామ్ చరణ్ 18 ఏళ్ల సినీ ప్రస్థానం

‘‘చరణ్ బాబు, 18 ఏళ్ల క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను.

నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ.. విజయోస్తు…!’’ అని పోస్టు చేశారు చిరు.

‘పెద్ది’ మూవీ నుంచి మాస్ లుక్ పోస్టర్

రామ్ చరణ్ 18 ఏళ్ల సినీ కెరీర్ ను పురస్కరించుకున్న అతని అప్ కమింగ్ మూవీ ‘పెద్ది’ నుంచి ఓ పోస్టర్ వదిలారు. ‘‘సినిమాల్లో మా పెద్ది 18 అద్భుతమైన సంవత్సరాలను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. స్క్రీన్ పై గొప్ప వారసత్వాన్ని మోసుకెళ్లడం నుండి తెర బయట సాధారణంగా అణిిగిమణిగి ఉండటం వరకూ మీరు మిగతా స్టార్ల కంటే వేరు. వేరుగా నిలబడి మీ సొంత మార్గాన్ని సుగమం చేశారు’’ అని పోస్టులో రాసుకొచ్చారు.

భుజాలకు క్రికెట్ కిట్ బ్యాగ్ తో, నోటిలో బీడీతో మాస్ లుక్ తో ఉన్న చరణ్ లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్ పై ప్రయాణం ఇప్పుడే మొదలైందని పేర్కొన్నారు. గేమ్ ఛేంజర్ లో అభిమానులు రామ్ ను చివరిసారిగా చూశారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత రామ్ నెక్ట్స్ సినిమాపై అంచనాలు ఎక్కువగా నెలకొన్నాయి. కానీ దురదృష్టవశాత్తు శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది జనవరిలో విడుదలైనప్పుడు ఒక ముద్ర వేయలేకపోయింది. ఆయన నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది మార్చి 27, 2026న విడుదల కానుంది.

తండ్రి చిరంజీవి గర్వంగా, ఎమోషనల్‌గా పెట్టిన పోస్ట్ రామ్ చరణ్ సినీ ప్రయాణానికి మరింత విలువనిచ్చింది. 18 ఏళ్లు పూర్తి చేసుకున్న చరణ్ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ‘పెద్ది’ సినిమాతో మరింత మాస్‌గా సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.