
📌 Key Points
- “పెద్ది” సినిమా జూన్ 4న విడుదలకు సిద్ధం, భారీ అంచనాలతో ప్రమోషన్స్ జోరు.
- కరోనా లాక్‌డౌన్‌లో మానసికంగా కుంగిపోయినట్లు రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు.
- నిరాశలో ఉన్న చరణ్‌కు రాజమౌళి ఇచ్చిన పవర్ఫుల్ సలహా జీవితాన్ని మార్చింది.
- చిన్న పనులతో మొదలుపెట్టి, మళ్ళీ మోటివేషన్ పొందిన మెగా పవర్ స్టార్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు షాకింగ్ న్యూస్! త్వరలో రాబోతున్న “పెద్ది” సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, చరణ్ తన జీవితంలోని అత్యంత క్లిష్టమైన దశ గురించి బయటపెట్టారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆయన ఎదుర్కొన్న మానసిక పోరాటం, రాజమౌళి ఇచ్చిన అద్భుత సలహా ఇప్పుడు వైరల్‌గా మారింది!
“పెద్ది” ప్రమోషన్స్‌లో చరణ్ షాకింగ్ నిజాలు!
Ram Charan : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో చరణ్ మూడు గేమ్స్ ఆడుతూ క్రాస్ ఓవర్ అథ్లెట్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ – బుచ్చిబాబు కలిసి కార్ లో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు చరణ్.
ఈ క్రమంలో చరణ్ కరోనా సమయంలో మానసికంగా చాలా లో ఫీల్ అయ్యానని, అపుడు రాజమౌళి ఓ సలహా ఇచ్చారని తెలిపాడు.
కరోనా లాక్‌డౌన్‌లో చరణ్ మానసిక పోరాటం!
రామ్ చరణ్ మాట్లాడుతూ.. కరోనా అందరికి ఏదో ఒక రకంగా ఇబ్బంది కలిగించింది. నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను. నేను ఒక కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నా అప్పుడు. RRR షూటింగ్ మధ్యలో లాక్ డౌన్ వచ్చింది. ఆ సినిమా కోసం బాడీ బాగా చేసి ఉన్నాను. జిమ్ కి వెళ్ళడానికి లేదు. చుట్టూ మనుషులు చనిపోతున్నారు. అప్పుడు మేము ఒక అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళం. ఉపాసన కరోనా సమయంలో కాల్స్ లోనే ఇంటి నుంచి వర్క్ చేస్తూ అపోలో పనులు చూసుకునేది. నేను ఒక రూమ్ లో తను ఒక రూమ్ లో ఉండేవాళ్ళం. నాకేం చేయాలో తెలియక సినిమాలు పెట్టుకొని చూస్తూ ఉండేవాడిని.
మూడు నెలలు అలా సింగిల్ గా ఉండేసరికి బాగా నెగిటివ్ థాట్స్ వచ్చాయి. నేను మానసికంగా కొంచెం డిప్రెషన్, కృంగిపోయాను అని చెప్పను కానీ అలాగే లో ఫీల్ అయ్యాను. లాక్ డౌన్ త్వరలో ఓపెన్ చేస్తారు అనగా నేను రాజమౌళి గారికి కాల్ చేసి ఒకసారి కలుద్దాం సర్ అన్నాను. ఏ జోష్ లో షూటింగ్ చేసామో. ఎలా చేసామో నాకు ఆ జోష్ ఇప్పుడు రావట్లేదు సర్, నాకు మోటివేషన్ రావట్లేదు అన్నాను. అపుడు ఆయన చెప్పిన మాట ఇవాళ్టికి నేను గుర్తిపెట్టుకున్నా.
రాజమౌళి ఇచ్చిన ఆ అద్భుత సలహా ఏంటి?
మోటివేషన్ ఏదో ఉంటే రాదు. షూటింగ్ కి ఇంకా టైం ఉంది. ఓ పని చెయ్ చిన్నచిన్నగా మొదలుపెట్టు. ఇవాళ లెగిసి ఏదో ఒక పని పెట్టుకో దాని కోసం పనిచేయి. లాక్ డౌన్ లో ఏం పని ఉంటది. నీ బెడ్ రూమ్ క్లీన్ గా పెట్టుకోవాలి అనుకో, దాని కోసం పనిచేయి. అలా ఏదో ఒక పని ఇంట్లోనే వెతుక్కొని దాని కోసమే ఆ రోజు నువ్వు మోటివేట్ అవ్వు. గార్డెన్, ఇల్లు, క్లీనింగ్ పనులు చెయ్యి. చిన్న, పెద్ద పనులు ఏదైనా అలాంటివి వెతుక్కొని చెయ్యి అన్నారు. అలా ఆయన చెప్పిన దగ్గర్నుంచి చిన్నగా పనులు మొదలుపెట్టుకొని వాటికోసమే మోటివేట్ అయ్యేవాడ్ని. ఇపుడు పెద్ద పనులు, సినిమాలు, పెద్ది కోసం బాడీ చేంజ్ కోసం మోటివేట్ అవ్వడం మొదలుపెట్టా. అప్పట్నుంచి నేను మళ్ళీ ఏ ఒక్క రోజు కూడా డీ మోటివేట్ అవ్వలేదు. పెద్దిలో హీరో కథ కూడా అదే తనని తాను ఒక కారణం వల్ల మోటివేట్ అయ్యే కథ అని అన్నారు.
చరణ్ – బుచ్చిబాబు ఫుల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..
రామ్ చరణ్ పంచుకున్న ఈ నిజాలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రాజమౌళి సలహా చరణ్‌కు ఎంతగానో ఉపయోగపడిందని స్పష్టమవుతోంది. “పెద్ది” సినిమా కోసం, మరిన్ని సంచలన అప్‌డేట్స్ కోసం వేచి చూడండి!


