
📌 Key Points
- రామ్ గోపాల్ వర్మ సంచలన నిర్ణయం: అతిథులకు భోజనం పెట్టనని ఖరాఖండిగా చెప్పేశారు!
- భోజనం పెట్టకపోవడానికి గల కారణాలను స్వయంగా వెల్లడించిన ఆర్జీవీ
- దర్శకుడిగా టాలీవుడ్‌లో తన ప్రస్థానం మొదలు పెట్టిన వర్మ బాలీవుడ్‌లోనూ సత్తా చాటారు.
- వివాదాలకు దూరంగా ఉంటున్న వర్మ.. ఇండస్ట్రీ సమస్యలపై అప్పుడప్పుడు స్పందిస్తుంటారు.
టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అతిథులకు భోజనం పెట్టనని ఆయన ఖరాఖండిగా చెప్పేశారు.
అతిథులకు భోజనం పెట్టకపోవడానికి కారణం ఇదే!
టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వివాదం అంటే వర్మ, వర్మ అంటే వివాదం అన్నట్టుగా ఉండేది పరిస్థితి. కాని ప్రస్తుతం కాస్త సైలెంట్ అయ్యాడు ఈ దర్శకుడు. ఇక టాలీవుడ్ లో తన సినిమా ప్రస్థానం మొదలు పెట్టిన రామ్ గోపాల్ వర్మ.. ఆతరువాత బాలీవుడ్ కు వెళ్లి, అక్కడ కూడా దశాబ్దానికి పైగా తనదైన మార్క్ చూపించారు. రంగీలా, సత్య, సర్కార్, రక్తచరిత్ర లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలతో రెచ్చిపోయాడు.
ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన వర్మ, ఎన్నో వివాదాస్పద సినిమాలు కూడా చేసి విమర్శలకు గురయ్యాడు. ఒకప్పుడు అద్భుతమైన సినిమాలతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆర్జీవీ.. ఆతరువాత చేసిన పొలిటికల్ సినిమాలు, గ్లామర్ మూవీస్ ఆయన ఇమేజ్ ను ఇబ్బందుల్లోపెట్టాయి. పొలిటికల్ గా ఎక్కువ విమర్శలకు ఫేస్ చేసిన వర్మ.. ప్రస్తుతం సినిమాలకే పరిమితం అయ్యారు. ఏదైనా సినిమా రిలీజ్ అయితే.. తన అభిప్రాయం వెల్లడించడం, ఇండస్ట్రీ ఇష్యూస్ లో ట్వీట్లు వేయడం వరకూ పరిమితం అయ్యారు రామ్ గోపాల్ వర్మ.
ట్రెండ్ సెట్టర్‌గా రామ్ గోపాల్ వర్మ సినీ ప్రస్థానం
గతంలో ఆర్జీవి ఏ కామెంట్స్ చేసినా.. అది పెద్ద రచ్చకు దారి తీసేది. ఉన్నది ఉన్నట్టు.. మాట్లాడే వర్మ.. ఎవరు ఏమన్నా వాటిని లెక్క చేయడు. తాను అనుకున్నది చెప్పేస్తుంటాడు. చాలా విషయాల్లో అందరికంటే డిఫరెంట్ గా ఆలోచిస్తుంటాడు వివాదాల దర్శకుడు. నలుగురురికి నచ్చేది తనకు నచ్చదంటుంటాడు. చాలా ఇంటర్వ్యూలలో వర్మ చెప్పిన విషయాలు అందరిని ఆశ్చర్చపరుస్తుంటాయి. అలాగే ఓ సందర్భంలో తనకు ఉన్న మరో అలవాటు గురించి చెప్పి షాక్ ఇచ్చాడు వర్మ.
వివాదాలకు దూరంగా ఉంటున్న ఆర్జీవీ
రామ్ గోపాల్ వర్మ ఇంటికి కానీ.. ఆఫీస్ కు కానీ ఎవరైనా వెళ్తే.. మర్యాదల విషయం మర్చిపోండి. ఎవరు వచ్చినా.. ఆయన మాత్రం భోజనం చేయండి అని మాత్రం అడగరు. అది ఆర్జీవికి నచ్చదు. ఈ విషయాన్ని స్వయంగా వర్మ ఓ ఇంట్వ్యూలో వెల్లడించారు. నా దగ్గరకు ఎవరు వచ్చినా.. భోజనం చేయమని అడగను. ఉన్నా కూడా పెట్టను. నావరకే ఉంది అని చెప్పేస్తాను. వచ్చినవారికి భోజనం పెట్టడం, ఆ సౌండ్స్ నాకు నచ్చవు. అందుకే నేను ఎవరికి అలాంటివి ఆఫర్ చేయను” అని నిక్కచ్చిగా చెప్పేశాడు వర్మ.
రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


