|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ram Kapoor: లగ్జరీ లంబోర్గినిని కొనుగోలు చేసిన నటుడు.. తొలి ఇండియన్‌గా ఘనత!

Published: 15-06-2025, 9:44 AM
Ram Kapoor: లగ్జరీ లంబోర్గినిని కొనుగోలు చేసిన నటుడు.. తొలి ఇండియన్‌గా ఘనత!

ప్రముఖ బాలీవుడ్ నటుడు రామ్ కపూర్ ఖరీదైన లంబోర్గిని ఉరుస్ ఎస్ఈ కారును కొనుగోలు చేశారు. భారతదేశంలో ఈ మోడల్ కారును కొనుగోలు చేసిన మొదటి నటుడిగా ఆయన గుర్తింపు పొందారు. తన భార్యతో కలిసి ఫోటోలు దిగారు.

Key Points

1

రామ్ కపూర్ లగ్జరీ లంబోర్గిని ఉరుస్ ఎస్ఈ కారును కొనుగోలు చేశారు.

2

ఈ కారు విలువ దాదాపు రూ.5.21 కోట్లు.

4

ప్రస్తుతం రామ్ కపూర్ 'మిస్త్రీ' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

లగ్జరీ కారు కొనుగోలు

ప్రముఖ బాలీవుడ్ నటుడు రామ్ కపూర్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. లగ్జరీ కార్ల బ్రాండ్లలో ఒకటైన లంబోర్గిని ఎస్‌ఈని తన సొంతం చేసుకున్నారు. ఈ ప్రత్యేక మోడల్‌ను కొనుగోలు చేసిన మొదటి భారతీయ నటుడిగా నిలిచారు. తన భార్య గౌతమి కపూర్‌తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ఈ కారు విలువ దాదాపు రూ.5.21 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.

రామ్ కపూర్ యొక్క కొత్త కారు

ఈ లంబోర్గిని ఉరుస్ ఎస్‌ఈ మోడల్ కారును  2024లో అధికారికంగా భారతదేశంలో రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఏ నటుడు ఈ కారును కొనలేదు. దీంతో మొదట ఈ లగ్జరీ కారు కొన్న నటుడిగా రామ్ కపూర్ నిలిచారు. రామ్ తన బ్రాండ్ న్యూ లంబోర్గిని కారుతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే అతని వద్ద రామ్ పోర్స్చే , పోర్సే, ఫెరారీ , రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్‌ వంటి కార్లను కూడా కలిగి ఉన్నారు.

మిస్త్రీ వెబ్ సిరీస్

ఇక సినిమాల విషయానికొస్తే రామ్ కపూర్ ప్రస్తుతం వెబ్ సిరీస్‌  మిస్త్రీలో కనిపిస్తాడు. ఇది అమెరికన్ సిరీస్ ఆధారంగా తెరెకెక్కించారు. ఇందులో అతను డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్ జూన్ 27 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా గతేడాది యుధ్రా మూవీలోనూ మెరిశారు.

రామ్ కపూర్ కొత్త లంబోర్గిని కారుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. తన నటనతో పాటు ఖరీదైన కార్లతోనూ ఆకర్షిస్తున్నారు ఆయన.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.