
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రం నుండి నాలుగో సింగిల్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ విడుదలైంది. నవంబర్ 28న విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్రం నుండి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఈ కొత్త పాట అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
Key Points
రామ్ పోతినేని 'ఆంధ్ర కింగ్ తాలూకా' నవంబర్ 28న విడుదల కానుంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకుడు.
తాజాగా 'ఫస్ట్ డే ఫస్ట్ షో' నాలుగో సింగిల్ ఘనంగా విడుదలైంది.
ఈ పాట అభిమానుల ఉత్సాహాన్ని, సినిమా పట్ల వారి ప్రేమను ప్రతిబింబిస్తుంది.
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ వివరాలు
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 28న థియేటర్లలో సందడి చేయనున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన సాంగ్స్‌తో పాటు ప్రతి అప్డేట్ సినీ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మేకర్స్ ఫోర్త్ సింగిల్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ను విడుదల చేశారు.
ఈ సాంగ్‌ను విమల్ థియేటర్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేయగా.. అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ FDFS పాట ఆ ఉత్సాహం, ఆ క్రేజ్ మొత్తాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. సినిమా పట్ల అభిమానుల ఇష్టం, ఆ ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభూతిని ఈ పాట ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా చూపించింది. దినేష్ కాకర్ల రాసిన సాహిత్యం అభిమానుల ప్రేమ, ఆతురత, అంకితభావాన్ని ప్రతీ లైన్ లో ఉత్సవంలా చూపిస్తుంది. పాటలో నిజమైన అభిమానుల గొంతులు వినిపించడం మరింత నిజాయితీని, అసలైన ఉత్సాహాన్ని తెస్తుంది. కాగా.. ఈ చిత్రంలో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్ లాంచ్
పాటపై అభిమానుల స్పందన
‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ పాట రామ్ సినిమాపై అభిమానుల అంకితభావాన్ని అద్భుతంగా చూపించింది. సినిమా విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రేక్షకుల్లో ఈ పాట మరింత ఉత్సాహాన్ని నింపింది. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధిస్తుందని అంచనా.



Sargun Mehta Urges People to Stop Negative Comments and Trolling Online