
📌 Key Points
- రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కు పాజిటివ్ టాక్ వచ్చింది.
- సినిమాకు ఇండియాలో 5 రోజుల్లో రూ.15.9 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
- అన్ సీజన్ (నవంబర్) లో రిలీజ్ కావడం వసూళ్లు తగ్గడానికి ఒక కారణం.
- ‘అఖండ 2’ రాబోతుండటం కూడా కలెక్షన్లపై ప్రభావం చూపుతోంది.
రామ్ పోతినేని నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, వసూళ్ల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అభిమానులు హిట్ ఆశించినా, కలెక్షన్లు మాత్రం నిరాశాజనకంగా ఉన్నాయి. దీనికి గల కారణాలు, రామ్ ఆవేదనపై కథనం.
పాజిటివ్ టాక్ ఉన్నా కలెక్షన్లు లేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’
వరుస ఫ్లాప్ లతో ఉక్కిరిబిక్కిరైన రామ్ పోతినేని లేటెస్ట్ గా ఆంధ్ర కింగ్ తాలూకా అంటూ వచ్చాడు. మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇంకేముంది రామ్ హిట్ ట్రాక్ ఎక్కాడనే అనుకున్నారు. కానీ కొత్తగా కలెక్షన్ కష్టం మొదలైంది.
ఇన్ని రోజులు హిట్ కష్టాలు పడ్డ రామ్ పోతినేనికి ఇప్పుడు మరో కష్టం వచ్చేసింది. ఆంధ్ర కింగ్ తాలూకాతో రామ్ హిట్ ట్రాక్ ఎక్కాడని ఫ్యాన్స్ సంబరపడ్డారు. మా స్టోరీనే అంటూ ప్రతి ఫ్యాన్ ఫీల్ అయ్యాడు. కానీ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. రీసెంట్ గా మూవీ సక్సెస్ మీట్ లోనూ హీరో రామ్ పోతినేని ఇదే విషయంలో తన ఫీలింగ్స్ బయటపెట్టాడు.
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ వసూళ్ల కష్టాలకు కారణాలు
ఆంధ్ర కింగ్ తాలూకా కలెక్షన్లు
ఇప్పటికీ ఈ సినిమా వసూళ్లు ఇండియాలో రూ.20 కోట్లకు కూడా చేరలేదు. అయిదు రోజుల్లో ఇండియాలో ఈ సినిమా రూ.15.9 కోట్లు నెట్ వసూళ్లు మాత్రమే ఖాతాలో వేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ కలెక్షన్లు రూ.23.15 కోట్లు మాత్రమే.
రామ్ పోతినేని నిరాశ: ‘అన్ సీజన్’ ప్రభావం
సాధారణంగా నవంబర్ లో సినిమాలు ఎక్కువగా రిలీజ్ కావు. దీన్ని అన్ సీజన్ అంటారు. అయినా తమ మూవీపై నమ్మకంతో ఆంధ్ర కింగ్ తాలూకాను రిలీజ్ చేశారు నిర్మాతలు. ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నారు. మరోవైపు ఈ వారం అఖండ 2 లాంటి భారీ సినిమా రాబోతుంది. ఇలాంటి పెద్ద మూవీ వస్తుందంటే అభిమానుల ఫోకస్ దానిపైనే ఉంటుంది. రామ్ చిత్రానికి వసూళ్లు రాకపోవడానికి ఇదీ ఓ కారణం. మొత్తానికి రాంగ్ టైమ్ కారణంగా ఓ మంచి సినిమా ఆడియన్స్ కు చేరలేకపోతుందనే టాక్ వినిపిస్తోంది.
మొత్తంగా, ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కు మంచి టాక్ వచ్చినా, విడుదల సమయం, ఇతర పెద్ద చిత్రాల ప్రభావం వల్ల ఆడియన్స్ కు చేరలేకపోతోందని స్పష్టమవుతోంది. ఇది రామ్ ప్రయత్నాలను దెబ్బతీసే అవకాశం ఉంది.


