
📌 Key Points
- ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ సినిమాలకు సక్సెస్ దక్కడం లేదు.
- తాజాగా విడుదలైన ఆంధ్ర కింగ్ తాలూకా అంచనాలను అందుకోలేకపోయింది.
- వరుస పరాజయాలతో రామ్ స్వయంగా కథ రాయాలని నిర్ణయించుకున్నారు.
- గతంలో నువ్వుంటే చాలు పాట రాసి మంచి ఆదరణ పొందారు రామ్.
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా విడుదలైన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రం అంచనాలను అందుకోలేకపోవడంతో, తన తదుపరి సినిమా కోసం స్వయంగా కథ రాయడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ కానుందని అభిమానులు భావిస్తున్నారు.
రామ్ కెరీర్ సంకటం
Ram Pothineni: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దేవదాసు సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం ఈయన వరుస హిట్ సినిమాలు ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇటీవల కాలంలో రామ్ పోతినేని స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో కాస్త తడబడుతున్నట్టు తెలుస్తోంది. ఈయన నటించిన సినిమాలన్నీ కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. తాజాగా మహేష్ బాబు. పి దర్శకత్వంలో రామ్ పోతినేని (Rampothineni)భాగ్యశ్రీ (Bhagya Shri)హీరో హీరోయిన్లుగా నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా (Andhra King Taluka)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నవంబర్ 27వ తేదీ విడుదల విడుదలైంది. ఫ్యాన్ కల్చర్ నేపథ్యంలో ఈ సినిమా ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో రామ్ అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా పూర్తిగా ప్రేక్షకులను నిరాశపరిచిన నేపథ్యంలో రామ్ డేరింగ్ స్టెప్ వేయబోతున్నారని తెలుస్తోంది. రామ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం కోసం ఇతర కథా రచయితలు, దర్శకులపై ఆశలు పెట్టుకోలేదని తెలుస్తోంది.
ఆంధ్ర కింగ్ తాలూకా నిరాశ
రామ్ హీరోగా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడం కోసం స్వయంగా ఆయనే మరోసారి పెన్ను పేపర్ చేత పట్టి తనకోసం ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రాయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా సక్సెస్ కానీ నేపథ్యంలోనే రామ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈయన నువ్వుంటే చాలు అని పాటను రాసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు ఎంతో మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమాకు పాట కాకుండా ఏకంగా స్టోరీనే సిద్ధం చేయబోతున్నారని సమాచారం.
ఇబ్బందుల్లో రామ్ పోతినేని కెరియర్..
సొంత కథతో రామ్ కమ్ బ్యాక్?
ఇలా రామ్ తన సినిమా కోసం స్వయంగా కథ రాయబోతున్నారని విషయం తెలియడంతో తన కథతో అయినా సక్సెస్ అందుకోవాలని అభిమానులు కూడా భావిస్తున్నారు. రామ్ చివరిగా ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో నటించిన ఈయన మాత్రం సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. చివరికి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేని నేపథ్యంలో రామ్ కెరియర్ కాస్త ఇబ్బందుల్లో పడిందనే చెప్పాలి. ఇలా వరుస డిజాస్టర్లు వెంటాడటంతో రామ్ కు అవకాశాలు కూడా క్రమక్రమంగా తగ్గిపోతున్నాయని తెలుస్తుంది.
వరుస ఫ్లాపులతో ఇబ్బందుల్లో ఉన్న రామ్ కెరీర్ కు సొంత కథ ఒక మలుపు అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. తన రచనా ప్రతిభతో రామ్ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని కోరుకుంటున్నారు. ఈ డేరింగ్ స్టెప్ ఆయన కెరీర్‌ను ఎలా మారుస్తుందో చూడాలి.


