
📌 Key Points
- రామ్ పోతినేని దర్శకత్వంలో సరికొత్త సినిమాకు సన్నాహాలు!
- ఆంధ్రా కింగ్ సాంగ్‌కు లిరిక్స్ రాసి తన టాలెంట్ చూపించిన రామ్!
- వరుస ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న రామ్.. సక్సెస్ కోసం కొత్త ప్రయత్నాలు!
- మార్చి లేదా ఏప్రిల్‌లో రామ్ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్!
టాలీవుడ్ నుండి ఒక సంచలన వార్త! ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇప్పుడు డైరెక్షన్ బాధ్యతలు చేపట్టబోతున్నాడా? తనలోని క్రియేటివ్ టాలెంట్‌ను మరోసారి నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు చూద్దాం!
డైరెక్టర్‌గా రామ్ పోతినేని?
Ram Pothineni : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మెగాఫోన్ పట్టబోతున్నాడనే టాక్ టాలీవుడ్‌లో బలంగా వినిపిస్తుంది. ఇటీవల విడుదలైన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో రామ్ ఓ పాటకు స్వయంగా లిరిక్స్ రాశాడు. నువ్వుంటే చాలే అనే సాంగ్‌కు ఆయన లిరిసిస్ట్. ఆ పాట ఫ్యాన్స్‌కి బాగా నచ్చింది. ఇది ఆయన క్రియేటివ్ ట్యాలెంట్‌ను బయటపెట్టింది. ఇప్పుడు మరో స్టెప్ ముందుకు వేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
తానే స్టోరీ రాసుకుని, దాన్ని తెరకెక్కించాలని రామ్ ప్లాన్ చేస్తున్నట్టు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. వరుస ఫ్లాప్‌లతో కాస్త ఇబ్బంది పడిన రామ్, ఇప్పుడు తన కెరీర్‌ని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించేందుకు ఫుల్ ఫోకస్ పెట్టాడట. ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ ఆశించినంత సక్సెస్ కాకపోవడంతో, ఆయన స్వయంగా ఒక పవర్‌ఫుల్ స్టోరీ రాసుకున్నాడని, దానికి సరైన డైరెక్టర్‌ను వెతుకుతున్నాడని అంటున్నారు.
స్టోరీ రెడీ.. డైరెక్షన్ ఎవరితో?
ఓ సినిమా తీయాలని అయితే రామ్ ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇప్పుడు రెడీ చేసుకున్న స్టోరీకి తానే డైరెక్టర్‌గా చేయాలా.? లేకపోతే డెబ్యూ డైరెక్టర్‌తో చేయించాలా అని ఆలోచిస్తున్నట్టు టాక్. మార్చి లేదా ఏప్రిల్‌లో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతోందని, షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోందని అంటున్నారు.
మార్చిలో రామ్ సినిమా ప్రకటన!
అయితే రామ్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాడని మరి కొందరు చెబుతున్నారు. తానే స్టోరీ రాసుకుని డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడని అంటున్నారు. రామ్ తన స్టోరీని తానే డైరెక్ట్ చేస్తాడా.? లేక ఎవరికైనా ఇచ్చి, నటుడిగా మాత్రమే ఫోకస్ చేస్తాడా.? లేదా ప్రొడ్యూసర్‌గా మారి డెబ్యూ డైరెక్టర్‌తో చేయిస్తాడా.? అనేది తెలియాల్సి ఉంది. అయితే రామ్ స్టోరీ-డైరెక్షన్ వైపు వెళ్తున్నాడనే టాక్ మాత్రం ఫ్యాన్స్‌లో ఎగ్జైట్‌మెంట్ పెంచేస్తోంది. రామ్ పోతినేని మెగా ఫోన్ పడుతాడో లేదో చూడాలి మరి.
రామ్ పోతినేని డైరెక్షన్‌లోకి వస్తాడా లేదా అనేది వేచి చూడాలి. దీనికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే పూర్తి వివరాలు మీ ముందుకు వస్తాయి!


