📌 Key Points
- రామ్ పోతినేని: ‘ఆంధ్రా కింగ్’ ఫలితంతో గ్యాప్ తీసుకుంటున్న రామ్!
- నెక్స్ట్ సినిమా కోసం స్వయంగా కథ రాయనున్న రామ్ పోతినేని!
- అబ్రాడ్ వెకేషన్ లో కథ సిద్ధం చేయనున్న ఎనర్జిటిక్ స్టార్!
- జూన్ లేదా జులైలో కొత్త సినిమా ప్రారంభం కానుందట!
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. ‘ఆంధ్రా కింగ్’ సినిమా తర్వాత రామ్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఫ్లాప్ తర్వాత రామ్ సంచలన నిర్ణయం!
Ram Pothineni: పాపం.. టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా కూడా ప్లాప్ గా నిలిచింది. నిజానికి ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఎవ్వరు కూడా బాలేదని చెప్పలేదు. నెగిటీవ్ రివ్యూలు కూడా తక్కివగానే వచ్చాయి. ఈసారి ఖచ్చితంగా రామ్ హిట్ కొడతారు అనుకున్నారు అంతా. కానీ, కథ అడ్డం తిరిగింది. బాగుందని టాక్ వచ్చిన సినిమాను చూడటానికి కూడా ఎవరు సాహసం చేయలేదు.
దాంతో, కమర్షియల్ గా ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ప్లాప్ లిస్టులో పడిపోయింది. రామ్ నటించిన చివరి బ్లాక్ బస్టర్ అంటే ఇస్మార్ట్ శంకర్ అనే చెప్పాలి. ఆ తరువాత వరుసగా రెడ్, ది వారియర్, డబుల్ ఇష్మార్ట్, ఆంధ్రా కింగ్ తాలూకా లాంటి సినిమాలు చేశాడు రామ్(Ram Pothineni). కానీ, ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. దాంతో, గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట రామ్.
కథారచయితగా రామ్ కొత్త ప్రయాణం!
అయితే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, రామ్ మంచి రచయిత కూడా. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో నువ్వుంటే చాల్లే అనే పాటను ఆయనే రాశాడు. అలా ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా కథను కూడా తానె రాసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. అందుకోసం మరోసారి కలం పట్టనున్నాడట రామ్. అబ్రాడ్ వెకేషన్ కి వెళ్లి అక్కడే దాదాపు మూడు నెలల పాటు స్పెండ్ చేసి తన నెక్స్ట్ సినిమా కథను తానే రాసుకోవాలని ఫిక్స్ అయ్యాడట.
కొత్త దర్శకుడితో రామ్ మూవీ ప్లాన్!
కాబట్టి, జూన్ కానీ, జులై లో కానీ రామ్ తన కొత్త సినిమాను స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోది. ఇక ఈ సినిమాను కొత్త దర్శకుడు తెరకెక్కించే అవకాశం ఉందట. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి తన నెక్స్ట్ సినిమా కోసం తానే కథను సిద్ధం చేసుకుంటున్న రామ్ ఈసారైనా టార్గెట్ మిస్ అవకుండా గోల్ కొడతాడా? హిట్ అందుకుంటాడా అనేది చూడాలి.
రామ్ తన సొంత కథతో వస్తున్నాడు కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


