|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కుటుంబంతో రాము రాథోడ్‌.. క్షమాపణలు చెబుతూ వీడియో

Published: 12-11-2025, 8:27 AM
కుటుంబంతో రాము రాథోడ్‌.. క్షమాపణలు చెబుతూ వీడియో

బిగ్ బాస్ తెలుగు 9 నుంచి సింగర్ రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. కుటుంబ సభ్యులను మిస్ అవ్వడం, తన వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఉండలేకపోవడం షోను వదిలి రావడానికి కారణమని వివరించాడు. అభిమానులకు క్షమాపణలు చెబుతూ కుటుంబంతో కలిసి ఒక వీడియోను పంచుకున్నాడు.

Key Points

1

బిగ్ బాస్ తెలుగు 9 నుంచి సింగర్ రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు.

2

కుటుంబ సభ్యులను మిస్ అవ్వడం, తన వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఉండలేకపోవడం కారణాలని చెప్పాడు.

4

తనుజ ప్రోత్సాహం ఉన్నా, హౌస్‌లో గొడవలు తనకి నచ్చలేదని వివరించాడు.

బిగ్ బాస్ నుండి రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి సింగర్‌ రాము రాథోడ్‌  సెల్ఫ్‌ ఎలిమినేట్‌తో  బయటకొచ్చేశాడు. కుటుంబ సభ్యులు ఎక్కువగా గుర్తుకొస్తున్నారంటూ స్వచ్ఛందంగా షో నుంచి ఆయన వైదొలిగాడు. అయితే, తన అభిమానలు మాత్రం కాస్త నిరాశ చెందారు. సుమారు 60రోజుల పాటు తనకోసం అండగా నిలబడి ఓట్లు వేసిన వారందరికీ రాము రాథోడ్‌ తన కుటుంబంతో పాటు క్షమాపణాలు చెప్పాడు.

అభిమానులకు కుటుంబంతో క్షమాపణలు

బిగ్‌బాస్‌ గురించి రాము  ఇలా చెప్పుకొచ్చాడు. ‘ నన్ను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకుల దేవుళ్లు అందరూ  క్షమించండి. ఇదంతా నా కుటుంబం. వీళ్లందరినీ వదిలేసి తొలిసారిగా అన్నిరోజుల పాటు బయటే ఉండటం జరిగింది. దీంతో కాస్త ఇబ్బంది పడ్డాను. కానీ, కేవలం మీ అభిమానం వల్ల మాత్రమే బిగ్‌బాస్‌లో కొంతకాలమైన ఉండగలిగాను. ముఖ్యంగా మా అమ్మ, పిల్లలు గుర్తుకు రావడంతో హౌస్‌ నుంచి వచ్చేశాను. నా చిన్నతనం నుంచి నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోలేదు. కేవలం బిగ్‌బాస్‌ కోసం అక్కడ వాళ్లతో గొడవపడటం కూడా నాకు నచ్చలేదు.

షో నుండి బయటకొచ్చిన కారణాలు

నా వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఉండటం వల్ల హౌస్‌లో ఉండలేకపోయాను. కానీ, తనూజ మాత్రం  చాలాసార్లు నన్ను ప్రోత్సహిస్తూ వచ్చింది. ప్రేక్షకుల నిర్ణయం వరకు ఉండాలని కోరింది. హౌస్‌లోని వారందరూ ఎంత ధైర్యం ఇచ్చినప్పటికీ అక్కడ ఉండటం ఇబ్బందిగానే ఉండేది. నా నిర్ణయాన్ని ప్రేక్షకులు గౌరవిస్తారని ఆశిస్తున్నాను.’ అంటూ రాము తన ఫ్యామిలీతో ఒక వీడియో పంచుకున్నాడు.

రాము రాథోడ్ తన నిర్ణయాన్ని అభిమానులు గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపాడు. బిగ్ బాస్‌లో తను ఎదుర్కొన్న వ్యక్తిగత సమస్యలను వివరిస్తూ, తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆయన భవిష్యత్తు ప్రయాణం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.