
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర ‘షో టైమ్’ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జూన్ 13న విడుదలైన మూడు సినిమాల గురించి, అలాగే అభిమానుల నుండి వచ్చిన ఆసక్తికర అభ్యర్థన గురించి ఆయన వెల్లడించారు.
Key Points
నవీన్ చంద్ర తాజా చిత్రం 'షో టైమ్' ట్రైలర్ విడుదల
జూన్ 13న మూడు సినిమాలు విడుదలై అద్భుతమైన రోజుగా మారిందని నవీన్ చంద్ర వెల్లడి
సినిమా థియేటర్లలో చూడలేకపోయిన అభిమానులు నిర్మాత యూపీఐ నంబర్ అడిగారని వెల్లడి
'షో టైమ్' సినిమా థియేటర్లలో చూడాలని నవీన్ చంద్ర అభ్యర్థన
‘షో టైమ్’ ట్రైలర్ విడుదల
టాలీవుడ్ నవీన్ చంద్ర వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే బ్లైండ్ స్పాట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నవీన్ చంద్ర.. షో టైమ్ అంటూ మరోసారి రెడీ అయిపోయారు. థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నవీన్.. అలాంటి కథతోనే మన ముందుకు రానున్నారు. ఈ సినిమాకు మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
నవీన్ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన నవీన్ చంద్ర ఆసక్తికర కామెంట్స్ చేశారు. జూన్ 13న తన మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయని తెలిపారు. ఆ రోజు నా జీవితంలో చాలా అద్భుతమైన రోజని అన్నారు. ఎక్కడో బళ్లారి నుంచి మీ వల్లే నేను ఈ పొజిషన్‌లో ఉన్నానని తెలిపారు. నా కెరీర్‌లో సక్కెస్ అయినా.. ఫెయిల్యూర్ అయినా ఇండస్ట్రీలోనే ఉంటానని అన్నారు.
అభిమానుల నుండి యూపీఐ నంబర్ అభ్యర్థన
చాలామంది మీ సినిమాలు థియేటర్లలో మిస్సయ్యాం.. మీ నిర్మాత యూపీఐ నెంబర్ పెట్టమని చాలామంది అడిగారని వెల్లడించారు. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అంటూ నవీన్ చంద్ర మాట్లాడారు. షో టైమ్ మూవీని థియేటర్లకు వచ్చి చూడండి.. మిమ్మల్ని డిస్సపాయింట్ చేయదు అంటూ ఆడియన్స్‌కు రిక్వెస్ట్ చేశారు నవీన్ చంద్ర. కాగా.. ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, వీకే నరేష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నవీన్ చంద్ర తన సినిమాలకు అద్భుతమైన స్పందన లభించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ‘షో టైమ్’ సినిమాను థియేటర్లలో చూడాలని ఆయన ప్రేక్షకులను కోరారు.

