|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శర్వానంద్ ‘బైకర్’: రేసింగ్ ట్రాక్ నుండి రిలీజ్ డేట్ వరకు, నిహారిక సినిమాతో పోటీ!

Published: 03-02-2026, 11:35 AM
శర్వానంద్ 'బైకర్': రేసింగ్ ట్రాక్ నుండి రిలీజ్ డేట్ వరకు, నిహారిక సినిమాతో పోటీ!
  • శర్వానంద్ హీరోగా ‘బైకర్’ మూవీ ఏప్రిల్ 3న విడుదల కానుంది.
  • ఈ సినిమాలో శర్వానంద్ రేసర్ పాత్రలో కనిపించనున్నారు.
  • నిహారిక నిర్మాణంలో వస్తున్న సినిమాతో ‘బైకర్’ పోటీ పడనుంది.
  • యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.

యంగ్ హీరో శర్వానంద్ నటించిన ‘బైకర్’ మూవీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుండగా, నిహారిక నిర్మిస్తున్న సినిమాతో పోటీ పడనుంది. బైక్ రేసింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.

శర్వానంద్ ‘బైకర్’ విడుదల ఎప్పుడంటే?

Biker Release: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand)ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు . ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈయన నారి నారి నడుమ మురారి(Nari Nari Naduma Murari) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు . ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో శర్వానంద్ తో పాటు చిత్ర బృందం ఎంత సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈయన తదుపరి సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ప్రస్తుతం పలు సినిమాలు షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి. అయితే త్వరలోనే శర్వానంద్ మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

శర్వానంద్ హీరోగా బైకర్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. బైక్ రేసింగ్ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా అప్పుడు వరుస సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం మరో కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని ఏప్రిల్ 3వ తేదీ విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. ఇక ఈ సినిమా నుంచి రేపు ఉదయం శర్వానంద్ బైకర్ సునీల్ పాత్రను పరిచయం చేస్తూ ఒక గ్లింప్ వీడియో కూడా విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం తెలియచేశారు. ఇక బైకర్ సినిమా విడుదలరోజే నిహారిక నిర్మాణంలో సంగీత శోభన్ నటించిన దాంట్లో రాకాసా కూడ విడుదల కాబోతోంది.

అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హై-ఆక్టేన్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో శర్వానంద్ రేసర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ జోడిగా మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించబోతున్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ కూడా శర్వానంద్ తండ్రి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్ బ్యానర్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. శర్వానంద్ సినీ కెరియర్ లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

నిహారిక సినిమాతో ‘బైకర్’ పోటీ!

The engine’s revved up 🏍️ The track is ready 🛣️ Now, THERE IS NO STOPPING HIM ❤️‍🔥 #BIKER grand release worldwide on April 3rd, 2026 💥💥 #BIKERMovie #GoAllTheWay 🏁 #BikerOnApril3rd

Charming Star @ImSharwanand #MalvikaNair @abhilashkankara @rajeevan69 @ghibranvaibodha … pic.twitter.com/HhIsmshA7i

— UV Creations (@UV_Creations) February 3, 2026

రేసింగ్ నేపథ్యంలో శర్వానంద్ మూవీ

శర్వానంద్ ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా నారీ నారీ నడుమ మురారి అనే సినిమాతో సక్సెస్ అందుకున్నారు మరి ఇలాంటి సూపర్ సక్సెస్ అందుకున్న ఈయనకు భయంకర సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈయన శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఇక ఈ సినిమాని కూడా 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి శర్వానంద్ ‘బైకర్’ ఏప్రిల్ 3న విడుదల కానుండగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.