
విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రమణి కళ్యాణం’ చిత్రం టైటిల్ లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. దీప్శిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రయాణం తాజాగా ప్రారంభమైంది. కిరణ్ అబ్బవరం, విజయ్ ఆంటోని వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రం ప్రేమ, విలువలతో కూడిన అందమైన ప్రయాణంగా ఉండబోతోంది.
Key Points
'రమణి కళ్యాణం' మూవీ టైటిల్ లుక్ పోస్టర్ తాజాగా విడుదల.
దీప్శిక, సూర్య వశిష్ట ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
కిరణ్ అబ్బవరం, విజయ్ ఆంటోని ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
సూరజ్ ఎస్ కురుప్ సంగీతం అందిస్తుండగా, రామ్ జగదీష్ సంభాషణలు, స్క్రీన్ ప్లే అందించారు.
ప్రధాన తారాగణం & సాంకేతిక నిపుణులు
విజయ్ ఆదిరెడ్డి(Director Vijay Adireddy) దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘రమణి కళ్యాణం’(Ramani Kalyanam). దీప్శిక(Deepshika), సూర్య వశిష్ట (Surya Vasishta)ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా టైటిల్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), వశిష్ట, విజయ్ ఆంటోని(Vijay Antony), జి.వి. ప్రకాశ్ కుమార్, సామ్ సి.ఎస్, రంజిత్ జేయకొడి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై టైటిల్ లుక్‌ను లాంచ్ చేసి.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. జీవితంలోని సవాళ్ల మధ్య ప్రేమ, విలువలు, హృదయాన్ని తాకే ఎమోషన్స్‌తో అందమైన ప్రయాణంగా ఈ సినిమా ఉండబోతోంది. వినోదం, భావోద్వేగం, విలువలతో కూడిన కథను నిజాయితీగా చెప్పబోతోతున్నామని తెలిపారు చిత్ర బృందం. ఈ చిత్రానికి సూరజ్ ఎస్ కురుప్ మ్యూజిక్ అందిస్తున్నారు. కోర్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ రామ్ జగదీష్ ఈ చిత్రానికి డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ‘రమణి కళ్యాణం’ తన అందమైన ప్రయాణాన్ని ఈరోజు ప్రారంభించింది. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ లాంటి ఆసక్తికర అప్‌డేట్స్ రానున్నాయి అని తెలిపారు.
ముఖ్య అతిథులుగా హాజరైన సినీ ప్రముఖులు
సినిమా కథా నేపథ్యం & తదుపరి అప్‌డేట్స్
‘రమణి కళ్యాణం’ చిత్రం ప్రేమ, సవాళ్లు, ఎమోషన్స్‌తో కూడిన అందమైన కథాంశంతో రూపొందుతోంది. చిత్ర బృందం త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ వంటి అప్‌డేట్‌లను విడుదల చేయనుంది. ఈ సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుందని ఆశిద్దాం.


