
నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది.
Key Points
రామాయణం సినిమా టైటిల్ టీజర్ 3D లో థియేటర్లలో విడుదల కానుంది.
మే 16 లేదా మే 23న టైటిల్ టీజర్ విడుదల అవుతుందని ఊహించబడుతోంది.
సాయి పల్లవి, రణ్‌బీర్ కపూర్, యష్ మరియు బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది.
రామాయణం టైటిల్ టీజర్ విడుదల తేదీ
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ (Nitesh Tiwari)తెరకెక్కిస్తున్న ఇతిహాస నాటకం ‘రామాయణ’. ఈ చిత్రాన్ని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ బ్యానర్‌పై నమిత్ మల్హోత్రా(Namit Malhotra) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతె మూవీ మేకర్స్ అంచనాలను పెంచేశారు. ‘రామాయణ’ రెండు భాగాలుగా రాబోతున్నట్లు ప్రకటించి ఆసక్తి రెట్టింపు చేశారు. మొదటి పార్ట్ వచ్చే ఏడాది విడుదల కాబోతుండగా.. రెండో భాగం 2027లో థియేటర్స్‌లోకి రానుంది. అయితే ఈ భారీ బడ్జెట్ సినిమాలో సాయి పల్లవి(Sai Pallavi) సీతగా నటిస్తుండగా.. రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే కేజీఎఫ్ స్టార్ యష్ రావణుడిగా, బాబీ డియోల్ హనుమంతుని పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘రామాయణ’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘రామాయణ’మూవీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ విడుదల కాబోతున్నట్లు టాక్. ఏకంగా ఈ వీడియోను మూవీ మేకర్స్ మే 16న థియేటర్స్‌లో 3Dలో తీసుకురాబోతున్నారట. లేదా మిషన్ ఇంపాజిబుల్ సినిమా విడుదల నాడు మే 23న థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత ఉందొ తెలియనప్పటికీ.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
నటీనటులు మరియు సినిమా విడుదల వివరాలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త
చివరగా, ‘రామాయణం’ సినిమా 3D టైటిల్ టీజర్ విడుదలకు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ టీజర్ సినిమాపై మరింత అంచనాలను పెంచుతుందని భావిస్తున్నారు.


