
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన మరోసారి తల్లి కాబోతున్నారు. ఈ శుభవార్తను తెలియజేస్తూ, ఉపాసన తన సీమంతం వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు హాజరై సందడి చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Key Points
రామ్ చరణ్, ఉపాసన దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.
ఉపాసన తన సీమంతం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వేడుకకు వెంకటేష్, నాగార్జున, నయనతార వంటి ప్రముఖులు హాజరయ్యారు.
మెగా ఫ్యామిలీ సభ్యులు కూడా ఉపాసన సీమంతంలో పాల్గొన్నారు.
ఉపాసన సీమంతం వీడియో వైరల్
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. గత కొంతకాలంగా ఉపాసన ప్రెగ్నెసీపై వార్తలు వస్తుండగా తాజాగా ఆ వార్తలకు తెరపడింది. ఉపాసన తన సీమంతం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోకు ఈ దీపావళికి డబుల్ సెలబ్రేషన్స్, డబుల్ లవ్, డబుల్ బ్లెస్సింగ్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాకుండా ఉపాసన సీమంతం వేడుక ఎంతో ఘనంగా జరగ్గా కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు వీడియోలో మెరిసారు.
హీరో వెంకటేష్ తన సతీమణితో కలిసి వేడుకకు హాజరవ్వగా నాగార్జున ఫ్యామిలీ సైతం వచ్చారు. వీరితో పాటు కోలీవుడ్ హీరోయిన్ నయనతార తన భర్త, పిల్లలతో కలిసి హాజరైంది. ఇక మెగాఫ్యామిలీ నుండి ఉపాసన, వరుణ్ తేజ్, నాగబాబు, వైష్ణవ్ తేజ్, పవన్ సతీమణి వేడుకలో మెరిసారు. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో అభిమానులు క్లింకారకు తమ్ముడు వచ్చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. VIDEO
వేడుకలో మెరిసిన సినీ ప్రముఖులు
క్లింకారకు తోడుగా మరో బిడ్డ
మొత్తంమీద, ఉపాసన సీమంతం వేడుక మెగా ఫ్యామిలీకి, అభిమానులకు డబుల్ సెలబ్రేషన్స్ తెచ్చింది. క్లింకారకు తమ్ముడు లేదా చెల్లి రావడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ శుభవార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.


