|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘నాకు పెళ్లి కాకముందే అమితాబ్‌‌తో పరిచయముంది.. మేము ఒకే సర్కిల్ లో కలిసి తిరిగాం’.. వదిన రమోలా షాకింగ్ కామెంట్స్

Published: 09-05-2025, 10:20 AM
‘నాకు పెళ్లి కాకముందే అమితాబ్‌‌తో పరిచయముంది.. మేము ఒకే సర్కిల్ లో కలిసి తిరిగాం’.. వదిన రమోలా షాకింగ్ కామెంట్స్

అమితాబ్ బచ్చన్ వదిన రమోలా బచ్చన్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమితాబ్ తో తన పెళ్లికి ముందు నుండే స్నేహం ఉందని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కోల్ కతాలో వారు ఒకే సర్కిల్ లో తిరిగారని ఆమె తెలిపారు.

Key Points

1

రమోలా బచ్చన్ అమితాబ్ బచ్చన్ తో పెళ్లికి ముందే స్నేహం ఉందని వెల్లడించారు.

2

కోల్‌కతాలో అమితాబ్ తో ఒకే సర్కిల్ లో తిరిగినట్లు చెప్పారు.

4

రమోలా కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రమోలా బచ్చన్ షాకింగ్ వెల్లడి

అమితాబ్ బచ్చన్ వదిన రమోలా బచ్చన్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంటర్వ్యూలో రమోలా మాట్లాడుతూ.. “నా స్నేహం అమితాబ్‌తో నాకు పెళ్లి కాకముందు నుంచే ఉందని వెల్లడించింది. నేను అజితాబ్‌ని కలవక ముందే మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని తెలిపింది. అమితాబ్ సినిమాకు ముందు రోజుల్లో కోల్‌కతాలో పనిచేశామని వెల్లడించింది.

అమితాబ్ తో పాత స్నేహం

మేము ఒకే సర్కిల్ లో తిరిగామని పేర్కొంది. నేను అతని ద్వారానే అజితాబ్ ని కలిశానని చెప్పుకొచ్చింది. మా మధ్య స్వచ్ఛమైన స్నేహం ఉందని గుర్తు చేసుకుంది. అలాగే ఈ క్రమంలోనే అజితాబ్ బచ్చన్ కంటే అమితాబ్ బచ్చన్ ఐదు సంవత్సరాలు చిన్నవాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రమోలా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)

రమోలా బచ్చన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అమితాబ్ బచ్చన్ తో ఆమె స్నేహం గురించి తెలిసిన విషయాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.