
బిగ్ బాస్ తెలుగు 9 నుండి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన రమ్య మోక్ష కేవలం 15 రోజులకే ఎలిమినేట్ కానుంది. హౌజ్‌లో ఆమె ప్రయాణం తక్కువ అయినప్పటికీ, ఈ వైరల్ బ్యూటీ అందుకున్న భారీ రెమ్యునరేషన్ చర్చనీయాంశంగా మారింది. ఆమె 2 వారాలకు ఎంత సంపాదించిందో ఇక్కడ తెలుసుకుందాం.
Key Points
రమ్య మోక్ష బిగ్ బాస్ తెలుగు 9 నుండి ఇవాళ ఎలిమినేట్ కానుంది.
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చి కేవలం 15 రోజులే హౌజ్‌లో ఉంది.
రమ్య మోక్ష వారానికి రూ. 2-3 లక్షల రెమ్యునరేషన్ అందుకుంది.
మొత్తం 2 వారాలకు రూ. 4-6 లక్షలు సంపాదించినట్లు అంచనా.
రమ్య మోక్ష ఎలిమినేషన్ వివరాలు
బిగ్ బాస్ 9 తెలుగు నుంచి ఇవాళ రమ్య మోక్ష ఎలిమినేట్ కానుంది. అక్టోబర్ 12న జరిగిన బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్ 2.Oతో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష హౌజ్‌లో కేవలం 15 రోజులు మాత్రమే ఉంది. మరి 2 వారాలకు రమ్య మోక్ష రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకుందాం.
బిగ్ బాస్ 9 తెలుగు జోరుగా సాగిపోతుంది. ఇప్పుడు ఏడో వారం కూడా పూర్తి కానుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ నేటితో 7వ వారం పూర్తి కానుంది. ఇక బిగ్ బాస్ అన్నాక ప్రతివారం ఒకరి ఎలిమినేషన్ కచ్చితంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ, 15 రోజుల ప్రయాణం
అరుపులు, కేకలతో సాగిన బిగ్ బాస్ తెలుగు 9 ఏడో వారం నామినేషన్స్‌లో 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఈ వారం రాము రాథోడ్, తనూజ పుట్టస్వామి, కల్యాణ్ పడాల, సంజన గల్రానీ, రమ్య మోక్ష, రీతూ చౌదరి, సాయి శ్రీనివాస్, దివ్య నిఖితా నామినేషన్స్‌లో ఉన్నారు. వీరికి నామినేషన్స్ పూర్తయిన రోజు నుంచే ఓటింగ్ పోల్స్ ఓపెన్ చేశారు.
ఇక డేంజర్ జోన్ అయిన చివరి రెండు స్థానాలు 8, 9లో సాయి శ్రీనివాస్, రమ్య మోక్ష మిగిలారు. ఓటింగ్ ప్రారంభం నుంచి వారం ముగిసేవరకు ఓటింగ్‌లో పెద్దగా మార్పులు జరగలేదు. చివరి రెండు స్థానాల్లోనే వీరిద్దరు ఉంటూ వచ్చారు. చివరిగా వీరిద్దరిలోనే ఎలిమినేషన్ ప్రక్రియ నిర్వహించారు.
2 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?
చిట్టి అలేఖ్య పికిల్స్ సిస్టర్స్ సోషల్ మీడియాలో తెగ్ ట్రెండ్ అవడమే కాకుండా విపరీతమైన నెగెటివిటీ తెచ్చుకున్నారు. వారిలో ఒకరైన రమ్య మోక్ష వైల్డ్ కార్డ్ కంటెంస్టెంట్గా అక్టోబర్ 12న బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్ 2.Oతో హౌజ్‌లోకి అడుగుపెట్టింది.
బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు రమ్య మోక్షకు వారానికి రూ. 2 నుంచి 3 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన 2 వారాలు హౌజ్‌లో ఉన్న సోషల్ మీడియా వైరల్ బ్యూటి రమ్య మోక్ష సుమారుగా రూ. 4 లేదా 6 లక్షల వరకు సంపాదించినట్లు తెలుస్తోంది.
మొత్తంగా, రమ్య మోక్ష బిగ్ బాస్ ప్రయాణం తక్కువ కాలం ఉన్నప్పటికీ, ఆమె అందుకున్న రెమ్యునరేషన్ ద్వారా వార్తల్లో నిలిచింది. 15 రోజుల్లోనే ఆమె గణనీయమైన మొత్తాన్ని సంపాదించి, బిగ్ బాస్ హౌస్ నుండి వీడ్కోలు పలికింది.


