|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rana Daggubati: బాహుబలిని కట్టప్ప చంపకపోయి ఉంటే ఏం జరిగేది అంటూ టీమ్ పోస్ట్.. రానా అదిరిపోయే రిప్లై

Published: 17-07-2025, 5:17 AM
Rana Daggubati: బాహుబలిని కట్టప్ప చంపకపోయి ఉంటే ఏం జరిగేది అంటూ టీమ్ పోస్ట్.. రానా అదిరిపోయే రిప్లై

బాహుబలి సినిమా రీ రిలీజ్ కాబోతున్న సందర్భంగా, చిత్ర యూనిట్ ట్విట్టర్‌లో ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది. బాహుబలిని కట్టప్ప చంపకపోతే ఏం జరిగేదో అని అడిగిన ప్రశ్నకు రానా దగ్గుబాటి ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Key Points

1

బాహుబలి రీ-రిలీజ్ సందర్భంగా ట్విట్టర్ పోస్ట్

2

బాహుబలిని కట్టప్ప చంపకపోతే ఏమై ఉండేదని ప్రశ్న

4

నెటిజన్ల నుండి వివిధ రకాల స్పందనలు

బాహుబలి రీ-రిలీజ్ ప్రమోషన్లు

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్(Re Release) ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు రీ రిలీజ్ మంచి విజయం సాధించాయి. అప్పట్లో ప్లాప్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు సైతం ఇప్పుడు రీ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ ఐకానిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ‘బాహుబలి’(Bahubali) మ‌ళ్లీ రీ రిలీజ్ కాబోతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా 10 ఏండ్లు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా మ‌ళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేయ‌బోతున్నారు మేక‌ర్స్. (బాహుబలి: ది ఎపిక్‌) BaahubaliTheEpic పేరుతో రెండు భాగాలను ఒకే పార్ట్‌గా అక్టోబర్ 31, 2025న ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయ‌బోతున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టినుంచే చిత్ర‌యూనిట్ ప్ర‌మోష‌న్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా బాహుబ‌లి టీమ్ ఎక్స్ వేదిక‌గా అభిమానుల‌ను అడుగుతూ.. ఒక‌వేళ బాహుబలిని కట్టప్ప చంపకపోయి ఉంటే ఏం జ‌రిగి ఉండేదంటూ పోస్ట్ పెట్టింది. దీనికి రానా(Rana Daggubati) రిప్ల‌య్ ఇస్తూ బాహుబ‌లిని కట్టప్ప చంపకపోయి ఉంటే అత‌డికి బ‌దులుగా నేను చంపేవాడిని అంటూ రానా రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ట్విట్టర్‌లో ఆసక్తికరమైన ప్రశ్న

రానా దగ్గుబాటి సమాధానం వైరల్

బాహుబలి రీ రిలీజ్‌కు సంబంధించిన ఈ ట్విట్టర్ పోస్ట్ మరియు రానా దగ్గుబాటి స్పందన సోషల్ మీడియాలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. అభిమానుల నుండి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.