
దీపికా పదుకోన్ పనిగంటల వివాదం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సీనియర్ హీరోయిన్ రాణి ముఖర్జీ తన అనుభవాన్ని పంచుకున్నారు. 14 నెలల పాపకు పాలిస్తూనే షూటింగ్‌కు వెళ్ళానని ఆమె తెలిపారు. ఇది దీపికాకు మద్దతుగా ఉందా లేదా కౌంటరా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
Key Points
దీపికా పదుకోన్ పనిగంటల కండిషన్స్‌తో సినిమాల నుంచి తొలగింపు.
రాణి ముఖర్జీ 14 నెలల కూతురికి పాలు ఇస్తూనే 'హిచ్‌కీ' షూటింగ్‌లో పాల్గొన్నారు.
దర్శకుడితో మాట్లాడి షూటింగ్ షెడ్యూల్‌ను సర్దుబాటు చేసుకున్నారు రాణి.
షూటింగ్ షరతులను ముందే చర్చించి, ఒప్పుకోకపోతే చేయవద్దు: రాణి సలహా.
దీపికా పదుకోన్ పనిగంటల వివాదం: బాలీవుడ్‌లో చర్చ
Rani Mukerji : ఇటీవల బాలీవుడ్ భామ దీపికా పదుకోన్ స్పిరిట్ సినిమా నుంచి తక్కువ పనిగంటలు పనిచేస్తాను అంటూ దాంతో పాటు చాలా కండిషన్స్ పెట్టడంతో ఆమెని తప్పించారు. ఆ తర్వాత కల్కి 2 నుంచి తప్పించారు. దీంతో దీపికా విషయం బాలీవుడ్ లో చర్చగా మారింది. ఈ క్రమంలో రోజుకు 8 గంటలే పనిచేస్తాము అనేదానిపై చర్చగా మారింది.(Rani Mukerji)
ఈ విషయంలో ఒకరిద్దరు తప్ప అందరూ దీపికాని తప్పు పడుతున్నారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది రెగ్యులర్ జాబ్ కాదు. అక్కడ కథ, టైమింగ్, వేరే స్టార్స్ డేట్స్ బట్టి షూటింగ్ జరుగుతుంది. చాలా మంది స్టార్స్ రాత్రి పగలు లేకుండా కష్టపడతారు. దీపికా చాలా కండిషన్స్ పెట్టినా 8 గంటలే పనిచేస్తాను అనేదానిపై మాత్రం చాలా మంది ఇండైరెక్ట్ గా స్పందిస్తున్నారు. కొంతమంది దీపికా ఇటీవలే తల్లి అయింది కాబట్టి తన కూతురికి సమయం ఇవ్వడానికి అలా చెప్తుంది అని ఆమెని వెనకేసుకొస్తున్నారు.
తల్లిగా షూటింగ్‌లో రాణి ముఖర్జీ అనుభవం
తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాణి ముఖర్జీ దీనిపై స్పందించారు. రాణి ముఖర్జీ మాట్లాడుతూ.. నేను హిచ్‌కీ సినిమా చేస్తున్నప్పుడు నా కూతురుకు 14 నెలల వయసు. అప్పుడు తనకు పాలు పడుతున్నా ఇంకా. నేను పొద్దున్నే పాలు పట్టి షూటింగ్‌కి వెళితే మధ్యాహ్నం వరకు నా పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వెళ్లి మళ్ళీ నా పాపకు పాలు ఇచ్చేదాన్ని. ఆ సినిమా అంతా అలాగే చేశాను.
నా షూటింగ్ పార్ట్ కొంత ముందే పూర్తిచేసి పంపించేలా దర్శకుడితో మాట్లాడుకున్నా. దాని బట్టి దర్శకుడు షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు. దీని గురించి మా దర్శకుడు, మూవీ యూనిట్ అంతా డిస్కస్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ విషయం గురించి పెద్ద చర్చలే జరుగుతున్నాయి. సినిమా నిర్మాతకు, దర్శకుడికి ఓకే అయితేనే ఆ సినిమా చేయాలి. దాని గురించి మనం అన్ని ముందే డిస్కస్ చేయాలి. వాళ్ళు ఒప్పుకోకపోతే సినిమా మానేయాలి. అది మన చేతుల్లోనే ఉంటుంది. మనల్ని చేయమని ఎవరూ ఫోర్స్ చేయరు అని చెప్పుకొచ్చింది.
నిర్ణయం మన చేతుల్లోనే: రాణి ముఖర్జీ స్పందన
దీంతో రాణి ముఖర్జీ తనకు తల్లిగా ఉన్నా కష్టపడుతూ షూటింగ్ చేశాను అని, ఆ షూటింగ్ చేయాలా వద్దా అనేది మన నిర్ణయం అని చెప్పింది కాబట్టి ఈమె దీపికాకు సపోర్ట్ చేసిందని పలువురు అంటే మరికొంతమంది మాత్రం అలాంటి పరిస్థితుల్లో కూడా దర్శక నిర్మాతలను ఒప్పించుకొని సినిమా చేసింది, దర్శక నిర్మాతలను నెగిటివ్ చేయలేదు, అంతా మన చేతుల్లోనే ఉంది అని అంటుంది కాబట్టి దీపికాకు కౌంటర్ ఇస్తుంది అని అంటున్నారు.
మొత్తంగా, షూటింగ్‌లో తల్లిగా ఎదురయ్యే సవాళ్లు, నిర్ణయాలు పూర్తిగా మన వ్యక్తిగతమని రాణి ముఖర్జీ స్పష్టం చేశారు. పని షరతులను ముందే చర్చించుకోవాలని ఆమె సూచించారు. ఇది దీపికాకు పరోక్షంగా ఒక సలహా లేదా సూచనగా పలువురు భావిస్తున్నారు.


