|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రణ్‌వీర్ సింగ్ కౌంటర్: దీపికాతో గొడవలా? బాలీవుడ్‌లో కొత్త చర్చ!

Published: 15-12-2025, 9:48 PM
రణ్‌వీర్ సింగ్ కౌంటర్: దీపికాతో గొడవలా? బాలీవుడ్‌లో కొత్త చర్చ!
  • దీపికా పదుకొణె 8 గంటల పనిదినాల కోసం పోరాటం చేస్తోంది.
  • పని గంటల షరతుల కారణంగా ఆమె భారీ ప్రాజెక్టులు కోల్పోతోంది.
  • రణ్‌వీర్ సింగ్ 8 గంటల పనిపై భార్యకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు.
  • ఈ వ్యాఖ్యలతో దీపికా, రణ్‌వీర్ మధ్య గొడవలు వచ్చాయని నెటిజన్లు చర్చ.

బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె 8 గంటల పనిదినాలపై గట్టిగా నిలబడుతున్నారు. అయితే, ఆమె భర్త రణ్‌వీర్ సింగ్ మాత్రం దీనికి విరుద్ధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

దీపికా పదుకొణె పని గంటల షరతులు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) గత కొద్ది కాలంగా 8గంటల పనిదినాల కోసం పోరాటం చేస్తోంది. కొద్ది కాలంపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె ఇటీవల కూతురు జన్మించగా.. సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కానీ దర్శకనిర్మాతలకే పలు కండిషన్లు పెడుతుండటంతో అమ్మడు పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఈమె కండిషన్ కారణంగా.. దీపికాను భారీ ప్రాజెక్ట్స్ నుంచి తొలగిస్తున్నారు. ఇటీవల ఆమెను స్పిరిట్, కల్కి-2 వంటి భారీ చిత్రాల కోసం సెలెక్ట్ చేసుకుని కండిషన్స్ పెట్టడంతో మరో హీరోయిన్‌ను తీసుకున్నారు. గత కొద్ది కాలంగా ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇక దీపికాకు కొందరు హీరోయిన్స్ సపోర్ట్‌గా నిలుస్తుంటే.. మరికొందరు మాత్రం ఆమెకు కౌంటర్లు వేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, దీపికా పదుకొణె భర్త రణ్‌వీర్ (Ranveer Singh)8గంటల పనిపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయా? అందుకే ఇలా మాట్లాడాడా? అని అంతా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

రణ్‌వీర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

అసలు విషయంలోకి వెళితే.. రణ్‌వీర్ సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. కేవలం వారంలోనే రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. సినీ స్టార్స్ ప్రశంసలు అందుకుంటుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణ్‌వీర్ సింగ్ 8 గంటల పనిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘చాలాసార్లు ఇతర నటీనటులు వారి మేనేజ్‌మెంట్ వారు, ‘మీరు అందరినీ పాడు చేస్తున్నారు’ అని ఫిర్యాదు చేస్తారు. అందరూ, మీరు కొన్నిసార్లు 8 గంటల షిఫ్ట్‌లో 10-12 గంటల పాటు షూటింగ్ చేస్తారు.

భార్యాభర్తల మధ్య విభేదాలు?

అప్పుడు మీతో పాటు మేము కూడా అలాగే చేయాల్సి వస్తుంది’ అని అంటారు. కానీ 8 గంటల్లో మన షూటింగ్ పూర్తి కావడం కష్టం. కాబట్టి ఇంకొంచెం ఎక్కువ సేపు షూటింగ్ చేయాల్సిందే. మంచి అవుట్‌పుట్ కోసం కష్టపడాలి కానీ ఇన్ని గంటలే చేయాలని కండిషన్ పెట్టుకోవద్దు. నేను దీన్ని ఒక వ్యాపార లావాదేవీలా చూసే భాగస్వామిని కాదు. నటనకే ప్రాధాన్యత ఇస్తాను’ అని చెప్పారు. ఇక ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు దీపికా, రణ్‌వీర్ మధ్య గొడవలు వచ్చాయి కావచ్చని అందుకే ఇలా మాట్లాడారని గుసగుసలాడుకుంటున్నారు. ఈ వ్యవహారం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

రణ్‌వీర్ సింగ్ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. దీపికా, రణ్‌వీర్ మధ్య గొడవలు వచ్చాయనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. వారి బంధంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.