
📌 Key Points
- రణ్‌వీర్ సింగ్ చిత్రం ‘దురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు వసూలు చేసిన తొలి బాలీవుడ్ చిత్రంగా నిలిచింది.
- ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1665 కోట్లకు పైగా వసూలు చేసి 2000 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తోంది.
- రణ్‌వీర్ సింగ్ నటన, ఆదిత్య ధర్ దర్శకత్వం సినిమా విజయానికి ప్రధాన కారణం.
- సినిమాలో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు.
రణ్‌వీర్ సింగ్ నటించిన ‘దురంధర్ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం ‘బాహుబలి’, ‘పుష్ప’ చిత్రాల రికార్డులను సైతం అధిగమించి వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా నిలిచింది.
దురంధర్ 2 సంచలన విజయం
Dhurandhar 2: ఇప్పటిదాకా హిందీ వెర్షన్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమా లిస్టు తీస్తే 895 కోట్ల వసూళ్లతో ‘ధురంధర్’ (2025) మొదటి ప్లేస్ లో ఉంటే,830 కోట్ల వసూళ్లతో పుష్ప 2 – ది రూల్ (2024) రెండో స్థానం,643 కోట్లతో షారుఖ్ ఖాన్’జవాన్’ మూడో స్థానం,511 కోట్ల కలెక్షన్లతో ప్రభాస్ బాహుబలి 2 నాలుగో స్థానంలో ఉన్న పరిస్థితి.కాని ఇప్పుడు సీన్ మారింది. అవును..వీటన్నింటిని వెనక్కి నెడుతూ దురంధర్ 2తో తొలిసారి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల వసూల్లని కొల్లగొట్టి iam the one and only అంటూ బెంచ్ మార్క్ సెట్ చేశాడు రణ్ వీర్ సింగ్.
ఏప్రిల్ 9 నాటికి 1041 కోట్ల నెట్ కలెక్షన్స్
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సరిగ్గా మూడు వారాల క్రితం అంటే మార్చి 20, 2026న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి కేవలం 21రోజుల్లోనే ఈ రికార్డ్ ని అందుకోవడం విశేషం.ట్రేడ్ పండిట్స్ చెబుతున్న లెక్కల ప్రకారం ఏప్రిల్ 9 నాటికి 1041 కోట్ల నెట్ కలెక్షన్స్ ని రాబట్టినట్టు తెలుస్తుంది.ఇక కేవలం ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా వసూళ్ల విషయానికి వస్తే,ఈ సినిమా ఇప్పటికే రూ.1665 కోట్ల మార్కును టచ్ చేసి 2000 కోట్ల క్లబ్ వైపు స్పీడ్ గా దూసుకెళ్తుంది.ఈ జోరు ఇలాగే కంటిన్యూ అయితే అందుకోవడం పెద్ద కష్టం కాదు కూడా.
రణ్‌వీర్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్
రణ్‌వీర్ సింగ్ తన కెరీర్ లో చూపెట్టిన ది బెస్ట్ పెర్ఫామెన్స్
ఇక ఈ సినిమా ఇంతటి సక్సెస్ చూడ్డానికి ఆదిత్య ధర్ విజన్ తో పాటు రణ్‌వీర్ సింగ్ తన కెరీర్ లో చూపెట్టిన ది బెస్ట్ పెర్ఫామెన్స్ అని చెప్పకతప్పదు.ముఖ్యంగా రణ్‌వీర్ స్పై రోల్ లో చూపెట్టిన ఇంటెన్సిటీ, ఎమోషన్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయ్.ఇక రణ్‌వీర్ తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి వెర్సటైల్ యాక్టర్స్ కీ రోల్స్ చేయడం సినిమాని మరో లెవల్ కి తీసుకువెళ్ళాయ్. ప్రధానంగా వీరి మధ్య జరిగే మైండ్ గేమ్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లకి ఫిదా అయిన ఆడియన్స్ థియేటర్లని విజిల్స్ తో హోరేత్తిస్తున్నారు.
సినిమా చుట్టూ కొన్ని కాంట్రవర్సీలు కూడా
సినిమా చుట్టూ వివాదాలు
ఇక సినిమా సక్సెస్ స్టోరీ ఇలా ఉంటె సినిమా చుట్టూ కొన్ని కాంట్రవర్సీలు కూడా చుట్టుముట్టాయ్. సినిమా ప్రమోషన్‌లో భాగంగా రణ్‌వీర్ సింగ్ సిక్కు టర్బన్ ధరించి పొగ తాగుతున్నట్లు ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిన సంగతి తెల్సిందే. దీనిపై సిక్కు సంఘాలు ఫైర్ అయి ముంబైలోని ములుండ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేయగా ఆ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేశారని క్లారిటీ ఇచ్చాడు ఆదిత్య ధర్. ఇక సినిమాలోని ఒక సీన్ లో ఆర్. మాధవన్ సిగరెట్ పట్టుకొని గురు గ్రంథ్ సాహిబ్ శ్లోకాలను చదివాడన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ డైలాగ్స్ చెప్పే ముందే సిగరెట్ ఆర్పెశానని క్లారిటీ ఇచ్చాడు మాధవన్.
ఏది ఏమైనా సినిమా 3 గంటల 49 నిమిషాల లెంత్ ఉంటె ఆడియన్స్ కి బోర్ కొడుతుంది అన్న కామెంట్స్ ని బ్రేక్ చేస్తూ ఏకంగా ఇండియన్ సినీ హిస్టరీనే సరికొత్త రికార్డులని సెట్ చేయడమంటే ఆదిత్య ధర్ విజన్ ని మెచ్చుకొని తీరాల్సిందే !
మొత్తానికి, ‘దురంధర్ 2’ రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు.

