|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ రివేంజ్: ట్రైలర్ విడుదల తేదీ ప్రకటన! బాక్సాఫీస్ బద్దలు ఖాయమా?

Published: 06-03-2026, 2:35 AM
రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' రివేంజ్: ట్రైలర్ విడుదల తేదీ ప్రకటన! బాక్సాఫీస్ బద్దలు ఖాయమా?
  • రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్: ది రివేంజ్’ ట్రైలర్ మార్చి 7న విడుదల కానుంది.
  • ఈ చిత్రంలో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం ఉంది.
  • ‘ధురంధర్’ సీక్వెల్ మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
  • మొదటి భాగం రూ.1300 కోట్లకు పైగా వసూలు చేసి భారీ విజయం సాధించింది.

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సీక్వెల్ ‘ధురంధర్: ది రివేంజ్’ ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం మార్చి 19, 2026న విడుదల కానుంది. మొదటి భాగం భారీ విజయం సాధించింది.

‘ధురంధర్: ది రివేంజ్’ ట్రైలర్ విడుదల తేదీ

Dhurandhar Trailer: బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన సెన్సేషనల్ హిట్ ‘ధురంధర్’ గురించి పరిచయం అక్కర్లేదు. స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్‌గా ‘ధురంధర్: ది రివేంజ్’ (Dhurandhar The Revenge) సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను రేపు, అంటే మార్చి 7వ తేదీ ఉదయం 11:01 గంటలకు సోషల్ మీడియా వేదికగా విడుదల చేయనున్నారు. ‘హోంస్లా.. ఈంధన్.. బద్లా’ (ధైర్యం.. ఇంధనం.. ప్రతికారం) అనే పవర్‌ఫుల్ నినాదంతో వస్తున్న ఈ సీక్వెల్, మొదటి భాగం కంటే రెట్టింపు యాక్షన్‌తో ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది.

Read also- Dishwasher vs Hand Washing: అంట్లు తోమడానికి .. రెండింటిలో ఏది బెస్ట్.. పైచేయి మనిషిదా? మిషన్‌దా?

డైరెక్టర్ ఆదిత్య ధర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు భారీ తారాగణం నటిస్తోంది. కీలక పాత్రల్లో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా మరియు సారా అర్జున్ వంటి దిగ్గజ నటులు నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 19, 2026న విడుదల చేయనున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

చిత్రంలో భారీ తారాగణం

Read also- Psychological horror thriller OTT: పెళ్ళి కాకుండానే ప్రెగ్నెన్సీ… నరకం చూపించే సైతాన్… ఏం సినిమా సామి

మొదటి భాగం సుమారు రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, ఇండియన్ సినిమా హిస్టరీలోనే టాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు సీక్వెల్ కూడా అదే రేంజ్‌లో బిజినెస్ చేస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా రణ్‌వీర్ సింగ్‌కు మంచి ఫాలోయింగ్ ఉండటంతో, ఇక్కడ కూడా భారీ స్థాయిలో థియేటర్లను కేటాయిస్తున్నారు. సుమారు 3 గంటల 55 నిమిషాల నిడివితో వస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి. ఈ నుంచి రాబోతున్న ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా విడుదల

Trailer out tomorrow 7th March at 11:01 AM #DhurandharTheRevenge Releasing In Cinemas Worldwide on 19th March 2026 in Hindi, Telugu, Tamil, Kannada & Malayalam pic.twitter.com/uieSQVIX0g

— Sanjay Dutt (@duttsanjay) March 6, 2026

రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ భారీ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. రేపు విడుదల కాబోయే ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.