|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

యష్ ‘టాక్సిక్’: బాక్సాఫీస్ బరిలో సవాల్! విడుదల అవుతుందా? లేదా?

Published: 26-01-2026, 5:35 AM
యష్ 'టాక్సిక్': బాక్సాఫీస్ బరిలో సవాల్! విడుదల అవుతుందా? లేదా?
  • మార్చి 19న ‘టాక్సిక్’, ‘దురంధర్ పార్ట్ 2’ విడుదల కానున్నాయి.
  • హిందీ మార్కెట్‌లో ‘టాక్సిక్’ మంచి వసూళ్లు సాధించగలదని అంచనా.
  • యశ్ ఫ్యాన్ బేస్ కారణంగా ‘టాక్సిక్’కు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.
  • ‘దురంధర్ 2’కు ఉన్న క్రేజ్ ‘టాక్సిక్’కు సవాలుగా మారనుంది.

యష్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమాకు ‘దురంధర్ పార్ట్ 2’ నుండి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

‘టాక్సిక్’ vs ‘దురంధర్ 2’: బాక్సాఫీస్ వార్

Yash Toxic: మార్చి 19 తేదీ భారతీయ సినిమా బాక్సాఫీస్‌కు చాలా కీలకంగా మారబోతోంది. అదే రోజున రెండు భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఒకటి ఆదిత్య ధార్ దర్శకత్వంలో వస్తున్న ధురంధర్ పార్ట్ 2, మరొకటి యశ్ హీరోగా నటిస్తున్న టాక్సిక్. ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉండబోతుందని ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ క్రమంలో యాశ్ సినిమా వాయిదా పడుతుంది అన్న వార్తలు వచ్చిన.. అది జరిగేలా లేదు. యాశ్ తప్పకుండా అనుకున్నదే సినిమా విడుదల చేయాలి అనుకుంటున్నారంట.

వాయిదా గురించి మాట్లాడుకునే ముందుగా ధురంధర్ పార్ట్ 2 గురించి చెప్పుకోవాలి. మొదటి భాగానికి వచ్చిన పేరు, దేశవ్యాప్తంగా ఏర్పడిన క్రేజ్ కారణంగా ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్, ప్రమోషన్లు చూసిన తర్వాత సినిమా పై మరింత బజ్ పెరిగింది. ఇప్పటికే ఈ సినిమాకు బలమైన ఆడియన్స్ బేస్ ఉంది. అందుకే దీన్ని ఎదుర్కొనడం ఏ సినిమాకైనా సవాలే అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే టాక్సిక్ మాత్రం ఈ పోటీ నుంచి వెనక్కి తగ్గే ఆలోచనలో లేదు. యశ్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా మీద చాలా నమ్మకం ఉంది. ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో టాక్సిక్ మంచి షేర్ సాధించగలదని అంచనాలు ఉన్నాయి. కొన్ని ట్రేడ్ లెక్కల ప్రకారం ధురంధర్ 2.. టాక్సిక్ మధ్య 60:40 లేదా 50:50 షేర్ కూడా ఉండొచ్చని చెబుతున్నారు. టాక్సిక్ ఎక్కువగా సింగిల్ స్క్రీన్స్, ప్రీమియం మల్టీప్లెక్స్‌లపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

యష్ సినిమాకు అడ్డంకులు ఏమిటి?

యశ్‌కు దక్షిణ భారతంలో ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కన్నడలో అయితే టాక్సిక్‌కు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అని భావిస్తున్నారు. కర్ణాటక ఈ సినిమాకు పెద్ద ఆదాయాన్ని తీసుకురానుంది. అలాగే తమిళనాడు, తెలంగాణ, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి మొత్తం కలెక్షన్లను బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా..రణవీర్ సింగ్ యాక్షన్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నా, యశ్ బాక్సాఫీస్ స్టామినాను తగ్గించడం అంత సులువు కాదని విశ్లేషకులు అంటున్నారు. యశ్ ఫ్యాన్ బేస్ చాలా లాయల్‌గా ఉంటుంది.

హిందీ మార్కెట్‌పై ‘టాక్సిక్’ ఆశలు

మొత్తం పైన మార్చి 19న ఈ రెండు సినిమాల మధ్య హై వోల్టేజ్ బాక్సాఫీస్ పోరు ఖాయంగా కనిపిస్తోంది. టాక్సిక్ ధురంధర్ పార్ట్ 2కి గట్టి పోటీ ఇస్తుందా? యశ్ ఈ క్లాష్‌లో ఆధిపత్యం చూపిస్తాడా? అన్నది సినిమా విడుదలైన తర్వాతే స్పష్టమవుతుంది.

యష్ ‘టాక్సిక్’ విడుదలపై ఇంకా సందిగ్ధత నెలకొంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ మేరకు నిలదొక్కుకుంటుందో చూడాలి. పోటీ తీవ్రంగా ఉండటంతో ఫలితం ఆసక్తికరంగా ఉండనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.