|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: 18 ఏళ్ల తర్వాత దీపికాకు రణవీర్ మాస్ రివేంజ్! దుమ్ములేపే ట్విస్ట్!

Published: 23-03-2026, 3:35 AM
షాకింగ్: 18 ఏళ్ల తర్వాత దీపికాకు రణవీర్ మాస్ రివేంజ్! దుమ్ములేపే ట్విస్ట్!
  • ఓం శాంతి ఓం లో దీపికాకు జరిగిన అన్యాయానికి 18 ఏళ్ల తర్వాత రణవీర్ పగ!
  • దురంధర్ సినిమాలో అర్జున్ రాంపాల్ పాత్రను అగ్నికి ఆహుతి చేసిన రణవీర్ సింగ్.
  • భార్యపై రణవీర్ ప్రేమను చూసి మురిసిపోతున్న అభిమానులు, వైరల్ అవుతున్న వీడియోలు.
  • సినిమా వేరైనా, విలన్ ఒక్కడే కావడంతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన ఈ సంఘటన!

బాలీవుడ్ లో ఒక సంచలనం! దీపికా పదుకొణెకు జరిగిన అన్యాయానికి రణవీర్ సింగ్ పగ తీర్చుకున్నాడా? ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి!

దీపికాకు జరిగిన అన్యాయం

బాలీవుడ్ మోస్ట్ లవ బుల్ కపుల్స్ లో దీపికా -రణవీర్ ముందు వరసలో ఉంటారు. వీరికి సంబంధించి ఏ విషయం అయినా నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. అంతేకాదు.. దీపికపై రణవీర్ ఎప్పటికప్పుడు తన ప్రేమను చూపిస్తూనే ఉంటాడు.తాజాగా మరోసారి భార్యపై ప్రేమను నిరూపించుకున్నాడు. అది కూడా 18 ఏళ్ల క్రితం ఒక సినిమాలో తన భార్య దీపికా కి జరిగిన అన్యాయానికి తాజాగా తన సినిమా ద్వారా పగ తీర్చుకున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే…

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె దాదాపు 18 ఏళ్ల క్రితం తన సినీ కెరీర్ ని ప్రారంభించింది. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ జంట గా ‘ ఓం శాంతి ఓం’ అనే సినిమాలో నటించి అందరినీ మెప్పించింది. ఆ మూవీలో అర్జున్ రాంపాల్ ( ముఖేష్ మెహ్రా పాత్రలో) విలన్ పాత్రలో నటించారు. ఆయన తన కెరీర్, స్వార్థం కోసం.. హీరోయిన్ శాంతి ప్రియ( దీపికా) ను ఒక సెట్ లో బంధించి, నిప్పు పెట్టి అత్యంత దారుణంగా చంపేస్తాడు. ఆ సీన్ కి తాజాగా రణవీర్ రివేంజ్ తీర్చుకోవడం గమనార్హం.

రణవీర్ సింగ్ రివేంజ్ స్టోరీ

దాదాపు ఓం శాంతి ఓం వచ్చిన 18 ఏళ్ల తర్వాత రణవీర్ సింగ్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోనూ అర్జున్ రాంపాల్ ఒక పవర్ ఫుల్ నెగటివ్ పాత్ర పోషించాడు. కథలో భాగంగా క్లైమాక్స్ లో రణవీర్ సింగ్.. అర్జున్ రాంపాల్ పాత్రను అంతం చేస్తాడు. ఓం శాంతి ఓం లో దీపిక పాత్ర ఎలా అయితే అగ్నికి ఆహుత అవుతుందో.. దురంధర్ లో అర్జున్ రాంపాల్ పాత్ర కూడా అలానే అగ్నికి ఆహుతి అవుతుంది.

వైరల్ అవుతున్న వీడియోలు

దీంతో.. ఈ రెండు సీన్ లను కలిపి నెట్టింట అభిమానులు వైరల్ చేస్తున్నారు. భార్యకు జరిగిన అన్యాయానికి రణవీర్ ఇలా పగ తీర్చుకున్నాడు అంటూ.. అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఓం శాంతి ఓం సినిమాలో శాంతి పాత్రకు ఇప్పటికి న్యాయం జరిగింది అంటూ అభిమానులు సంబరపడుతున్నారు. దీంతో.. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలు వేరైనా, పాత్రలు వేరైనా.. విలన్ మాత్రం ఒకడే కావడంతో.. ఈ కోయిన్సిడెన్స్ బాలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రణవీర్ అభిమానులు దీపికా అభిమానులు ఈ వీడియోలను షేర్ చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.