
టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశి ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బ్లాక్ డ్రెస్‌లో కొత్త ఫోటోలను పోస్ట్ చేసింది. ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ‘తెలుసు కదా’ చిత్రంలో నటిస్తోంది.
Key Points
రాశి ఖన్నా బ్లాక్ డ్రెస్‌లో అద్భుతంగా కనిపించింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
‘తెలుసు కదా’ సినిమాలో రాశి సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటిస్తోంది.
రాశి ఖన్నా తాజా ఫోటోలు
‘ఊహలు గుసగుసలాడే’(Oohalu Gusagusalade) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా(Rashi Khanna) మనందరికీ సుపరిచితమే. తన ఫస్ట్ మూవీతోనే ఈ బ్యూటీ యూత్ క్రష్‌గా మారిపోయింది. తన అందం, అభినయంతో కుర్రాళ్లను ఫిదా చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వరుస సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది.
ప్రజెంట్ ఈ అమ్మడు తెలుగులో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(Telusu Kada) మూవీలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్(Bollywood)లోనూ వెబ్ సిరీస్, ఐటెం సాంగ్స్‌లో చిందులేస్తూ ఉంది. ఓ పక్క సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మరో పక్క నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో హీట్ పుట్టించడంతో పాటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
నెటిజన్ల ప్రశంసలు
తాజాగా రాశి ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ డ్రెస్సులో దర్శనమిచ్చింది. కళ్లకు కాటుక పెట్టుకోవడంతో ఈ ముద్దుగుమ్మ మరింత అందంగా కనిపించింది. అలాగే వైట్ తెర వెనుక నిలబడి ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. అంతేకాకుండా వాటికి.. ‘బయట అంతా మంచు, లెక్కించదగ్గ చోటంతా నిప్పు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ ఫొటోలు కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు వావ్ సూపర్ ఉన్నావు అని కామెంట్స్ చేస్తున్నారు.
‘తెలుసు కదా’ సినిమా
A post shared by Raashii Khanna (@raashiikhanna)
రాశి ఖన్నా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన అభిమానులతో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ ఫోటోలతో ఆమె మరోసారి తన అందాన్ని ప్రదర్శించింది.



Sargun Mehta Urges People to Stop Negative Comments and Trolling Online