
📌 Key Points
- నటి రాశీసింగ్ తన కాలేజీ రోజుల్లోని ప్రేమకథను తాజాగా బయటపెట్టింది.
- ఇంటర్ చదువుతున్నప్పుడు ఒక లెక్చరర్‌తో ప్రేమాయణం నడిపినట్లు వెల్లడించింది.
- ఆహా ఓటీటీలో రాబోతున్న 3 రోజెస్ సీజన్ 2 ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయాన్ని తెలిపింది.
- లెక్చరర్‌తో సంబంధం సరదాగా ఉండేదని, అప్పుడు తన వయసు 17 అని పేర్కొంది.
నటి రాశీసింగ్ తన అభిమానులతో తన ప్రేమకథను పంచుకుంది. ఇంటర్ చదువుతున్న రోజుల్లో లెక్చరర్‌తో ప్రేమాయణం నడిపినట్లు వెల్లడించింది. త్వరలో ఆహా ఓటీటీలో రానున్న 3 రోజెస్ సీజన్ 2 సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఈ ఆసక్తికర విషయాలు తెలిపింది. ఆమె లవ్ స్టోరీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
రాశీసింగ్ లవ్ స్టోరీ రివీల్
Rashi Singh : హీరో హీరోయిన్స్ అప్పుడప్పుడు తమ ప్రేమ కథలను బయటపెడుతుంటారు. తాజాగా హీరోయిన్ రాశీసింగ్ తన లవ్ స్టోరీ బయటపెట్టింది. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న హీరోయిన్ రాశీ సింగ్ త్వరలో ఆహా ఓటీటీలో 3 రోజెస్ సిరీస్ సీజన్ 2 తో రాబోతుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ బయటపెట్టింది రాశీ సింగ్.(Rashi Singh)
ఇంటర్ లెక్చరర్ తో ప్రేమాయణం
రాశీ సింగ్ తన లవ్ స్టోరీ గురించి చెప్తూ.. నేను స్కూల్ అయ్యాక ఇంటర్‌లో ఉన్నప్పుడు ఒక లెక్చరర్‌ను ప్రేమించాను. అతను నాకు బాయ్ ఫ్రెండ్. కాలేజీలో నాకు అతను ఫేవర్ గా ఉండేవాడు. ఆయన నాకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లు ఇచ్చేవాడు, వైవాలో ఏమి అడిగేవారు కాదు. వైవా జరిగినప్పుడు మేమిద్దరం సరదాగా కూర్చొని ఒక పది నిముషాలు టైమ్ పాస్ చేసుకునేవాళ్లం. అప్పుడు నా ఏజ్ 17. అప్పుడు అతనికి ఇంకా పెళ్లి అవ్వలేదు. ఇప్పుడు అతనికి పెళ్లి అయింది. అతను సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్నాడు. వాళ్ళ ఆవిడ కూడా ఫాలో అవుతుంది అనుకుంట. మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు అని తెలిపింది.
3 రోజెస్ 2 ప్రమోషన్స్‌లో వెల్లడి
రాశీసింగ్ తన గత ప్రేమాయణం గురించి నిజాయితీగా పంచుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. లెక్చరర్‌తో తన సంబంధం కేవలం సరదాగా ఉండేదని ఆమె స్పష్టం చేసింది. ఈ వెల్లడితో ఆమె వ్యక్తిగత జీవితంపై ఆసక్తి మరింత పెరిగింది.


