
📌 Key Points
- నటి రాశి సింగ్ తన ఫస్ట్ క్రష్ గురించి వెల్లడి.
- తన స్కూల్ లవ్ స్టోరీని బయటపెట్టిన రాశి సింగ్.
- స్కూల్‌లో తన టీచరే బాయ్‌ఫ్రెండ్ అని షాకింగ్ నిజం.
- ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్.
యంగ్ హీరోయిన్ రాశి సింగ్ తన ఫస్ట్ క్రష్, స్కూల్ లవ్ స్టోరీ గురించి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. తన బాయ్‌ఫ్రెండ్ స్కూల్ టీచరేనని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
రాశి సింగ్ సంచలన ఇంటర్వ్యూ
Rashi Singh : సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల ప్రేమాయణం గురించి రకరకాల వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. వాటి గురించి ఓపెన్ అయ్యేవాళ్లు తక్కువమంది. ఐతే ఇండస్ట్రీలోకి రావడానికి ముందే తమ జీవితంలో జరిగిన కొన్ని లవ్ స్టోరీల గురించి ఇంటర్వ్యూలలో బయట పెట్టేస్తారు. ఈ మధ్య ఇండస్ట్రీలోని హీరోయిన్ ఇంటర్వ్యూలలో పాల్గొంటు ఫస్ట్ క్రష్ గురించి బయట పెట్టేస్తున్నారు. అవి కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా మరో యంగ్ హీరోయిన్ రాశి సింగ్ ఓ ఇంటర్వ్యూ తన ఫస్ట్ క్రష్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.. అసలు ఈ బ్యూటీ మనసు పడేసుకున్న ఆ వ్యక్తి ఎవరో కాస్త వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశి సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. రీసెంట్ గా వచ్చిన రాజ్ తరుణ్ నటించిన పాంచ్ మినార్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. తన కొత్త వెబ్ సిరీస్ ‘3 రోజెస్’ ప్రమోషన్లో భాగంగా చేసిన ఒక ఇంటర్వ్యూలో తన స్కూల్ లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది.. ఆ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్ గురించి బయటపెట్టేసింది.. స్కూల్లో ఉన్నపుడు తనకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని వెల్లడించింది రాశి సింగ్. ఆ బాయ్ ఫ్రెండ్ తన టీచరే అని రాశి చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు.. ఇప్పుడు ఆమె వయసు 17 సంవత్సరాలు అని చెప్పగానే ఆశ్చర్య పోయారు.. ఆ టైంలోనే లవ్ స్టోరీ నడిపించేసావా అని అవాక్కాయ్యారు.. మేమిద్దరం అలా ఉండడం వల్లనే నాకు ఏ క్వశ్చన్ పేపర్ కూడా ముందే వచ్చేది.. అంతేకాదు ల్యాబ్ ఎగ్జామ్ లలో వైవాను కూడా అడిగేవాడు కాదు అలా మా ప్రేమ నడిచింది అని తన లవ్ స్టోరీ గురించి బయట పెట్టేసింది హీరోయిన్.. ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ఆ వయసులోనే స్కూల్లో ఇంత నడిపించావు అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై రాశి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..
స్కూల్ లవ్ స్టోరీ వివరాలు
నెటిజన్ల కామెంట్స్, ఆమె స్పందన
శశి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రాశి సింగ్. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు.. కానీ ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. సినిమాలుకు కాస్త గ్యాప్ తీసుకునే ఈ అమ్మడు తర్వాత వరుసగా సినిమాలను అనౌన్స్ చేసే పనిలో పడ్డారు. కానీ ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలు ఏవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వలేదు.. రీసెంట్ గా వచ్చిన పాంచ్ మినార్ మూవీ కూడా నిరాశనే మిగిల్చింది. గతంలో వచ్చిన వెబ్ సిరీస్ ‘3 రోజెస్’ లో నటించింది. అది పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఆ మూవీకి సీక్వెల్ గా 3 రోజెస్ సీజన్ 2 స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రస్తుతం తెలుగులో ఓ భారీ ప్రాజెక్ట్ లో నటిస్తుందని టాక్.. త్వరలోనే ఆ మూవీ గురించి వెల్లడించే అవకాశాలు ఉన్నాయి..
స్కూల్ వయసులో రాశి సింగ్ నడిపిన ప్రేమాయణంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


