
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి ఫోటోలకు డిజిటల్ రికార్డ్ బ్రేక్!
- ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మిక పెళ్లి ఫోటోలకు 25 మిలియన్ల లైక్స్!
- విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన రష్మిక మందన్న సంచలనం!
- ఆసియాలోనే నంబర్ 1 స్థానంలో రష్మిక పెళ్లి ఫోటో వైరల్!
టాలీవుడ్ జంట రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ జంట అభిమానులకు ఒక పెద్ద షాక్ ఇచ్చింది. రష్మిక సరికొత్త రికార్డులతో దూసుకుపోతుంది.
రష్మిక పెళ్లి ఫోటోల వైరల్ హంగామా!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న అధికారికంగా పెళ్లి చేసుకున్నారు. దీంతో తమ ప్రేమ, పెళ్లిపై వస్తున్న ఎన్నో గాసిప్స్‌కు ఈ జంట ఫుల్‌స్టాప్ పెట్టింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో చాలా గ్రాండ్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. రాజుల కాలాన్ని తలపించేలా వీరి వివాహం జరగడం విశేషం. దీంతో ఇప్పుడీ పెళ్లి గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.
విజయ్-రష్మిక జంట పెళ్లి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త రికార్డుని బ్రేక్ చేసింది. రష్మిక మందన్నా ఇన్ స్టాగ్రామ్‌లో తన పెళ్లి ఫోటోలను పంచుకోగా, అవి ఇప్పటికే 25మిలియన్స్ లైక్స్ దాటింది. ఇది అరుదైన రికార్డుగా చెప్పొచ్చు.
విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన రష్మిక
రష్మిక మందన్న తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫిబ్రవరి 28 ఉదయం 9 గంటల సమయానికి ఈ పోస్ట్‌కు 23 మిలియన్ల లైక్స్ వచ్చాయి. మార్చి 1కి ఇది 25.7(26 ) మిలియన్స్ కి చేరుకుంది. దీంతో ఆసియాలోనే ఒక ఫోటోకు అత్యధిక లైక్స్ పొందిన సెలబ్రిటీగా రష్మిక నిలిచింది.
ఇంతకుముందు, 2024 టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచినప్పుడు విరాట్ కోహ్లీ ట్రోఫీని ముద్దాడుతున్న ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోకు 22.8 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇప్పటి వరకు దీనికి 23 మిలియన్స్ కి చేరుకుంది. గత రెండేళ్లలో ఆసియాలోనే అదే ఆల్-టైమ్ రికార్డ్.
ఆసియా ‘క్వీన్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్’గా రష్మిక
ఇప్పుడు ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న.. విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అరుదైన రికార్డును బ్రేక్ చేసింది. దీంతో ఆమె ఆసియా ‘క్వీన్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్’గా నిలిచింది.
మరోవైపు, రష్మిక చేయి పట్టుకున్న విజయ్ దేవరకొండ షేర్ చేసిన పెళ్లి ఫోటోకు కూడా భారీ స్పందన వచ్చింది. ఈ పోస్ట్‌కు 20 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి.
రష్మిక మందన్న పెళ్లి ఫోటోలు సృష్టించిన ఈ సంచలనం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరిన్ని సినిమా అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


