|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలీవుడ్ ఖాన్ మూవీ పై రష్మిక సంచలన కామెంట్స్! స్టోరీ వేరు మూవీ వేరు అంటూ షాకింగ్ కామెంట్స్!

Published: 19-01-2026, 4:00 AM
బాలీవుడ్ ఖాన్ మూవీ పై రష్మిక సంచలన కామెంట్స్! స్టోరీ వేరు మూవీ వేరు అంటూ షాకింగ్ కామెంట్స్!
  • సికందర్ మూవీలో రష్మిక పాత్ర నిడివి తగ్గించడంతో అసంతృప్తి!
  • సల్మాన్ ఖాన్‌తో రష్మిక జోడీ ‘తండ్రీకూతుళ్ల’లా ఉందని నెటిజన్ల విమర్శలు!
  • సినిమా కథాంశం నచ్చినా.. తెరపై ఆశించిన ఫలితం లేదని రష్మిక కామెంట్స్!
  • సూర్యవంశీ, నిశ్చయ్ చిత్రాలు నచ్చకపోయినా.. సికిందర్ ప్లాట్ ఇష్టమని సల్మాన్ ఖాన్ ధీమా!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన ‘సికందర్’ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమా విడుదల తర్వాత రష్మిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సికందర్ మూవీపై రష్మిక షాకింగ్ కామెంట్స్!

నేషనల్ క్రష్ రష్మకి మందన్నా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో జోడీగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా సికందర్. అయితే, సికందర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరా పరాజయం పాలైంది. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా నటించిన ‘సికందర్’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఈ సినిమా వైఫల్యంపై స్పందించిన రష్మిక.. తనకు చెప్పిన కథకు, తెరపైకి వచ్చిన సినిమాకు చాలా తేడా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సల్మాన్, రష్మిక జోడీపై నెటిజన్ల ట్రోల్స్!

అయితే, బలహీనమైన కథనం, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ లోపించడంతో సికందర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. తాజాగా సికందర్ పరాజయంపై రష్మిక మందన్నా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

నిజానికి సినిమాలో రష్మిక మందన్నా పాత్ర నిడివిని ఎడిటింగ్‌లో బాగా తగ్గించేశారని, అందుకే ఆమె పాత్ర అంతంతమాత్రంగానే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తూ.. “సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా తండ్రీకూతుళ్లలా కనిపిస్తున్నారు తప్ప జంటలా లేరు. అసలు ఎడిటింగ్ వల్ల కథలో అర్థం పర్థం లేకుండా పోయింది” అని విమర్శించారు.

సినిమా ప్లాట్ నచ్చిందన్న సల్మాన్ ఖాన్!

“నేను చేసిన సినిమాల్లో నాకు సూర్యవంశీ, నిశ్చయ్ వంటి పాత సినిమాలు నచ్చవు. కానీ ‘సికందర్’ గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అది డిజాస్టర్ అని వారు అనుకోవచ్చు కానీ, నేను మాత్రం అలా నమ్మను. ఆ సినిమా ప్లాట్ (కథాంశం) నాకు చాలా నచ్చింది” అని సల్మాన్ ఖాన్ ధీమా వ్యక్తం చేశారు.

రష్మిక మందన్నా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. సికందర్ మూవీకి సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.