
పాన్ ఇండియా సినిమాలతో అదరగొట్టిన రష్మిక మంధాన, తాజా ఇంటర్వ్యూలో తన వృత్తి జీవితం, విజయాలు, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. నటి అవ్వాలని అనుకోలేదని, కుటుంబం, స్నేహితుల మద్దతు ఎంతో ముఖ్యమని ఆమె తెలిపింది.
Key Points
రష్మిక మంధాన తన నటనా ప్రయాణం గురించి పంచుకుంది.
విజయం, అంచనాల ఒత్తిడిని ఎదుర్కొనే విధానాన్ని వివరించింది.
తన సలహా: భయపడకుండా, అనుకున్నది సాధించండి.
రష్మిక మంధాన నటనా ప్రయాణం
యానిమల్, పుష్ఫ 2, ఛావా, సికిందర్.. ఇవీ వరుసగా రష్మిక మంధాన చేసిన పాన్ ఇండియా సినిమాలు. ఇందులో సికిందర్ రిజల్ట్ నిరాశ కలిగించినా యానిమల్, పుష్ఫ 2, ఛావా మూవీస్ తో రష్మిక అదరగొట్టింది. కలెక్షన్లు దుమ్ము దులిపిన ఈ సినిమాలతో రష్మిక మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఈ నేపథ్యంలో హిందూస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.
హిందూస్తాన్ టైమ్స్ తో ఇంటర్వ్యూ లో రష్మిక తన వృత్తి, విజయం ఒత్తిళ్లను ఎలా ఎదుర్కొంటుందో వివరించింది.
“విజయం, అంచనాల ఒత్తిడిని ఎదుర్కోవడానికి వస్తే జీవితంలో ఏమీ శాశ్వతం కాదని నేను పూర్తిగా అర్థం చేసుకున్నా. నేను ఎప్పుడో చెప్పినట్లుగా మీకు ఒక రోజు అన్నీ ఉండవచ్చు. తర్వాతి రోజు ఏం లేకపోవచ్చు. ఆ దృక్పథం నన్ను స్థిరంగా ఉంచుతుంది. నా కుటుంబం, సన్నిహిత స్నేహితులు, నా బృందంలో బలమైన మద్దతు నాకుంది’’ అని క్రోక్స్ గ్లోబల్ అంబాసిడర్ అయిన రష్మిక మంధాన తెలిపింది.
విజయం మరియు ఒత్తిడి
“పూర్తి నిజాయితీగా చెప్పాలంటే, నా చిన్నతనంలో నేను నటి అవుతానని ఎప్పుడూ ఊహించలేదు. అదెప్పుడూ నా ప్లాన్స్ లో భాగం కాదు. కానీ ఇప్పుడు తిరిగి వెనక్కి చూస్తే నేను ఈ స్థాయికి చేరుకున్నందుకు ఎంతో గొప్పగా ఉంది. నటిగా నా ప్రయాణ నా జీవితాన్ని అర్థవంతమైన విధంగా మార్చింది’’ అని రష్మిక పేర్కొంది.
“వృత్తిపై నా దృక్పథం ఎల్లప్పుడూ సరళంగా ఉంది. మీ హృదయం సంతోషంగా ఉండే పని చేయండి. భయపడుతున్నా లేదా వెనుకాడుతున్న ప్రతి ఒక్కరికీ ఇచ్చే సలహా ఒక్కటే.. బయటకు వెళ్ళండి! అనుకున్న దాన్ని సాధించండి. ఎందుకంటే అది మీది. కూర్గ్ వంటి చిన్న పట్టణం నుంచి వచ్చిన ఒక అమ్మాయి (నేను) దీన్ని చేయగలిగితే, మీరు కూడా చేయగలరు!’’ అని రష్మిక చెప్పింది.
‘‘నా ప్రయాణంలో కఠినమైన పాఠాలు ఏవీ లేవు. కానీ కొన్ని విలువైన అనుభవాలున్నాయి. అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటి ఎల్లప్పుడూ మీ ఉత్తమ ప్రయత్నం చేయడం. 100% ఇవ్వడం. కానీ ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టాల్సిన అవసరంతో మీపై భారం వేసుకోకండి. మొదట మీ సంతోషంపై దృష్టి పెట్టండి” అని 29 ఏళ్ల స్టార్ హీరోయిన్ రష్మిక చెప్పింది.
కుటుంబం, స్నేహితుల మద్దతు
“ఖచ్చితంగా నిర్మాణాత్మక విమర్శలను స్వీకరించాలి. కానీ అది మిమ్మల్ని కుంగనివ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే మీ వాల్యూ మీకు మాత్రమే తెలుసు. అన్నింటికంటే ముఖ్యంగా మీరు నిజంగా కోరుకునేదాని కోసం వెళ్ళండి’’ అని రష్మిక తెలిపింది.
కన్నడ సినిమా కిరిక్ పార్టీతో తెరంగేట్రం చేసిన రష్మిక మంధాన.. తెలుగులో ఛలో సినిమాతో అడుగుపెట్టింది. అప్పటి నుంచి వరుసగా బ్లాక్ బస్టర్లతో అదరగొడుతోంది. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో సినిమాలతో తిరుగులేకుండా దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆమె యాక్ట్ చేసిన కుబేర మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ది గర్ల్ ఫ్రెండ్, తామా సినిమాల్లో చేస్తోంది రష్మిక.
రష్మిక మంధాన తన విజయం వెనుక ఉన్న కష్టపాటు, కుటుంబం, స్నేహితుల మద్దతును గుర్తుచేసుకుంటూ, ప్రేరణాత్మక సందేశంతో తన ఇంటర్వ్యూను ముగించింది. ఆమె అనుభవాలు మరియు సలహాలు అందరికీ స్ఫూర్తినిస్తాయి.


