
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
- రిసెప్షన్ కి హాజరైన ప్రముఖ వైద్యుడు గురువా రెడ్డి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
- కొన్నేళ్ల క్రితం మోకాళ్ళ నొప్పితో డాక్టర్ ని కలిసిన రష్మిక మందన్న.
- రిసెప్షన్ లో డాన్స్ చేస్తూ మళ్ళీ మోకాళ్ళ నొప్పి తెచ్చుకున్న రష్మిక.. విజయ్ పరిస్థితి ఏంటి?
టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో మనందరికీ తెలుసు. అయితే, రిసెప్షన్ తర్వాత రష్మికకి ఊహించని సమస్య ఎదురైంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే చదవండి!
విజయ్ – రష్మిక రిసెప్షన్ లో డాక్టర్ గురువా రెడ్డి సందడి!
Rashmika Mandanna : ఇటీవలే విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో రిసెప్షన్ కూడా భారీగా నిర్వహించగా సినీ పరిశ్రమతో పాటు అనేక రంగాల్లోని ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో విజయ్ – రష్మిక రిసెప్షన్ కి ప్రముఖ వైద్యుడు గురువా రెడ్డి హాజరయ్యారు.
సామి సామి స్టెప్పులతో రష్మిక మోకాళ్ళకు మళ్ళీ గాయం!
ఆర్థోపెడిక్ సర్జన్ గా, రచయితగా, సోషల్ మీడియా సెలబ్రిటీగా మంచి ఫేమ్ తెచ్చుకున్నారు గురువా రెడ్డి. విజయ్ రష్మిక రిసెప్షన్ కి హాజరయి అక్కడ వారితో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఆసక్తికర విషయం తెలిపారు.
విజయ్ దేవరకొండకి కొత్త టెన్షన్.. రష్మిక మోకాళ్ళ బాధ్యత ఎవరిది?
గురువారెడ్డి తన సోషల్ మీడియాలో రష్మికతో దిగిన ఫోటో షేర్ చేసి.. సామి సామి అంటూ స్టెప్పులు వేసి మోకాళ్ళ నొప్పితో కొన్నేళ్ల క్రితం నన్ను కలిసింది రష్మిక మందన్న. ఇప్పుడు నన్ను రిసెప్షన్ కి ఆహ్వానించింది. రిసెప్షన్ కి వెళ్ళినప్పుడు సంగీత్ లో విపరీతంగా డాన్సులు వేసి మళ్ళీ మోకాళ్ళు పట్టుకున్నాయి. ఈసారి నేనొక్కదాన్నే కాదు మరో పేషెంట్ కూడా వస్తాడు అంటూ విజయ్ ని చూపించింది. ఆ అలసిన మోకాళ్ళ బాధ్యత నాదే అంటూ పోస్ట్ చేసారు.
రష్మిక మందన్న మోకాళ్ళ నొప్పి గురించి డాక్టర్ గురువా రెడ్డి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


