
📌 Key Points
- రష్మిక మందన్నా బ్లాక్ బస్టర్ చిత్రాలతో టాప్ స్టార్ లిస్టులో చేరి, ఆమె కోసమే కథలు సిద్ధమవుతున్నాయి.
- డబ్బు కోసం సినిమాలు చేసే రోజులు పోయాయని, ఇప్పుడు మంచి పాత్రలు ఎంచుకునే స్థాయికి ఎదిగానని రష్మిక వ్యాఖ్యానించింది.
- ప్రస్తుతం ‘మైసా’ చిత్రంలో రష్మిక అడవి బిడ్డగా మాస్ లుక్‌లో కనిపించనుంది, టీజర్ కి మంచి స్పందన వచ్చింది.
- తన విజయానికి రచయితల మీద ఉన్న నమ్మకమే కారణమని, వారి సిద్ధం చేసిన కథలు నచ్చితే తప్పకుండా చేస్తానని రష్మిక తెలిపింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. డబ్బు కోసం సినిమాలు చేసే రోజులు పోయాయని, ఇప్పుడు తన కోసమే ప్రత్యేకమైన కథలు సిద్ధమవుతున్నాయని రష్మిక పేర్కొంది. ఇది తన విజయం అని చెప్పింది.
రష్మిక మందన్నా కెరీర్ ప్రస్థానం
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) గురించి ప్రత్యేకమైన పరిచేయం అవసరంలేదు. వరుస బ్లాక్ బస్టర్స్ కొడుతూ ప్రస్తుతం ఆమె టాప్ స్టార్ లిస్టులో చేరిపోయారు.
Rashmika Mandanna made some interesting comments about her career
“మైసా” సినిమా: అడవి బిడ్డగా రష్మిక
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచేయం అవసరంలేదు. వరుస బ్లాక్ బస్టర్స్ కొడుతూ ప్రస్తుతం ఆమె టాప్ స్టార్ లిస్టులో చేరిపోయారు. ఒక సినిమాలో ఆమె హీరోయిన్ అనే స్థాయి నుంచి ఇప్పుడు ఆమె కోసమే కథలు సిద్ధం చేసుకునే రేంజ్ కి ఆమె ఎదిగారు. ఈ ప్రయాణంలో ఆమె ఎంతో ట్రోలింగ్స్, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. కానీ, ఆమె ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. అందుకే, ఇప్పుడు వరుసగా భారీ సినిమాలు చేస్తూ వస్తున్నారు రష్మిక మందన్నా. ఈ స్టార్ బ్యూటీ లేటెస్ట్ నటిస్తున్న సినిమా మైసా.
Disha Patani: దిశా పటాని గ్లామర్ షోకి.. సోషల్ మీడియా షేక్.. ఫోటోలు
నా విజయానికి కారణం రచయితలే: రష్మిక
హీరోయిన్ ఓరియెంటెడ్ గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక(Rashmika Mandanna) అడవి బిడ్డగా మాస్ లోక్ లో కనిపించబోతుంది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఏడాది ఈ సినిమాప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘ఒక నటిగా సినిమా సినిమాకీ నాపై బాధ్యత పెరుగుతోంది. పాత్రల కోసం వెతుకులాడే స్థాయి నుంచి మంచి పాత్రలు ఎంచుకునే స్థాయికి ఎదిగాను. డబ్బు కోసం సినిమాలు చేసే రోజులు పోయాయి. ఇప్పుడు నాకోసం ప్రత్యేకమైన కథలు సిద్ధమవుతున్నాయి.
ఓ రకంగా చెప్పలంటే ఇది నేను సాధించిన విజయంగా చెప్పుకోవాలి. ఇలాంటి పాత్రలే చేయాలని గిరి గీసుకులేదు. నాకోసం రచయితలు ఎలాంటి కథలు రెడీ చేస్తే, అవి నాకు నచ్చితే తప్పకుండా చేస్తూనే ఉంటాను. నాకు నాకన్నా రచయితల మీదనే నమ్మకం ఎక్కువ’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ఇపుడు రష్మిక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రష్మిక మందన్నా చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డబ్బుకు కాకుండా కథకు ప్రాధాన్యత ఇస్తూ ఆమె తీసుకున్న నిర్ణయం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె తదుపరి సినిమా ‘మైసా’పై అంచనాలు పెరిగాయి.


