|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్‌కు రష్మిక షాక్! స్పెషల్ సాంగ్‌కు నో చెప్పడానికి అసలు కారణమిదేనా?

Published: 01-02-2026, 7:35 AM
రామ్ చరణ్‌కు రష్మిక షాక్! స్పెషల్ సాంగ్‌కు నో చెప్పడానికి అసలు కారణమిదేనా?
  • రామ్ చరణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం రష్మికను సంప్రదించినట్లు సమాచారం.
  • రష్మిక ప్రస్తుతం హీరోయిన్‌గా బిజీగా ఉండటం వల్లే నో చెప్పిందనే టాక్.
  • ఫిబ్రవరి 26న రష్మిక వివాహం రాజస్థాన్‌లో జరగనుందని సమాచారం.
  • పెళ్లి పనుల్లో బిజీగా ఉండటం వల్ల స్పెషల్ సాంగ్‌కు రష్మిక నో చెప్పిందనే వార్తలు.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న రామ్ చరణ్‌తో కలిసి నటించే అవకాశం వచ్చినా కూడా నో చెప్పిందట. రామ్ చరణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఆమెను సంప్రదించగా రష్మిక తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీనికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

రామ్ చరణ్‌కు నో చెప్పిన రష్మిక

Rashmika Mandanna: కొన్ని కాంబినేషన్స్‌ని చూడాలని స్టార్ హీరోలకు చెందిన ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) చేసింది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ, బీభత్సమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. టాలీవుడ్‌లో ఆమె స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ (Allu Arjun) సరసన మాత్రమే నటించింది. ‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో అల్లు అర్జున్, రష్మిక జంట రికార్డులు క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఆమె టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ, నాని వంటి హీరోలతో సినిమాలు చేశారు కానీ.. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల చిత్రాలలో మాత్రం ఆమెకు ఛాన్స్ రాలేదు. ఛాన్స్ రాలేదా? లేదంటా వచ్చినా కూడా వద్దనుకుందా? అనే విషయం పక్కన పెడితే.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) సరసన నటించే అవకాశం వచ్చినా కూడా ఈ నేషనల్ క్రష్ చేయనని చెప్పిందట. ఇప్పుడిదే టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

రష్మిక తిరస్కరణకు కారణం ఇదేనా?

కాకపోతే రష్మిక నో చెప్పడానికి ఓ కారణం ఉంది. ఈ మధ్య ఆమె ఓ స్టేట్‌మెంట్ ఇచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. తను నటించే సినిమాలలో తప్పితే స్పెషల్ సాంగ్‌ని చేయనని చెప్పింది. తను హీరోయిన్‌గా నటించే చిత్రం కాకుండా, ఇద్దరు దర్శకులు చేసే సినిమాల్లో స్పెషల్ సాంగ్ చేయడానికి సిద్ధమని చెప్పింది. కాకపోతే ఆ ఇద్దరి పేర్లు మాత్రం ఆమె రివీల్ చేయలేదు. ఇక విషయంలోకి వస్తే.. ఇప్పుడు రామ్ చరణ్ చేస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమాలో స్పెషల్ సాంగ్ కోసమని రష్మికను సంప్రదించగా, ఆమె సున్నితంగా తిరస్కరించిందనేలా టాక్ నడుస్తుంది. ఆమె ఇప్పటికే ఓ స్టేట్‌మెంట్ పాస్ చేసి ఉండటం సంగతి అటుంచితే.. రష్మిక మందన్నా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయకపోవడానికి మరో కారణం కూడా ఉందట. అదేంటంటే..

పెళ్లి పనుల్లో బిజీగా రష్మిక మందన్న

ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా బిజీగా ఉన్న విషయం తెలియంది కాదు. మరో వైపు రౌడీ హీరోతో తనకు నిశ్చితార్థం కూడా పూర్తయ్యి, పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లో పెళ్లి అని అంటున్నారు. పెళ్లి తేదీ నాటికి తను ప్రస్తుతం అంగీకరించిన చిత్రాల షూటింగ్‌ను ఓ కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నాల్లో బిజీబిజీగా రష్మిక ఉంది. అందుకే, రామ్ చరణ్ సరసన స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చినా కూడా ఆమె చేయనని చెప్పినట్లుగా తెలుస్తోంది. అందులోనూ ఈ సాంగ్‌ని ఫిబ్రవరి 15 తర్వాతే షూట్ చేయాలని అనుకుంటున్నారట. ఆ సమయంలో పెళ్లి పనులతో బిజీబిజీగా ఉంటుంది కాబట్టే.. ‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌కు రష్మిక నో చెప్పిందనేలా ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ కోసం మరో తార కోసం టీమ్ సెర్చ్ చేస్తున్నట్లుగా సమాచారం. బాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్‌ని ఈ సాంగ్ కోసం సంప్రదిస్తున్నారనేలా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం.. ఫైనల్‌గా ఎవరు ఫైనల్ అవుతారో..

మొత్తానికి రామ్ చరణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వచ్చినా రష్మిక నో చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.