|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌పై రష్మిక మందన్నా రివ్యూ.. ఒక్క మాటతో తేల్చిన నేషనల్ క్రష్.. పెళ్లి డేట్ ఎప్పుడు అంటూ?

Published: 31-07-2025, 7:33 AM
విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌పై రష్మిక మందన్నా రివ్యూ.. ఒక్క మాటతో తేల్చిన నేషనల్ క్రష్.. పెళ్లి డేట్ ఎప్పుడు అంటూ?

విజయ్ దేవరకొండ నటించిన కింగ్‌డమ్ సినిమాపై రష్మిక మందన్నా తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఒక్క మాటతో సినిమా గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఆమె ట్వీట్ వైరల్‌గా మారింది. విజయ్ కూడా ఆమెకు స్పందించాడు.

Key Points

1

రష్మిక మందన్నా 'కింగ్‌డమ్' సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చింది.

2

విజయ్ దేవరకొండకు రష్మిక ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

4

విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నా గతంలో 'గీత గోవిందం', 'డియర్ కామ్రెడ్' సినిమాల్లో నటించారు.

రష్మిక మందన్నా కింగ్‌డమ్ రివ్యూ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం కింగ్‌డమ్. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన కింగ్‌డమ్ సినిమాలో మరో హీరో సత్యదేవ్ నటించాడు. హీరోయిన్‌గా బ్యూటిఫుల్ భాగ్యశ్రీ బోర్సే చేసింది.

లైగర్ , ఖుషి, ఫ్యామిలీ స్టార్ వంటి ఫ్లాప్ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న సినిమా కావడంతో కింగ్‌డమ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ కావడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో జూలై 31న అంటే ఇవాళ థియేటర్లలో కింగ్‌డమ్ విడుదలైంది.

విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ సినిమాపై ఇప్పటికే హీరో నాని , దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్ రివ్యూ ఇచ్చారు. విజయ్ దేవరకొండ నటనపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండ రూమర్ గర్ల్‌ఫ్రెండ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా కింగ్‌డమ్ మూవీపై రివ్యూ ఇచ్చింది.

సోషల్ మీడియాలో వైరల్

ఒక్క మాటతో కింగ్‌డమ్ సినిమా ఏంటో తేల్చి చెప్పేసింది రష్మిక మందన్నా . తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) అకౌంట్‌లో కింగ్‌డమ్ సినిమా గురించి ఒక్క మాటతో ప్రశంసలు కురిపించింది రష్మిక మందన్నా. “నీకు, నిన్ను ప్రేమించే వాళ్లందరికి ఇది ఎంత ముఖ్యమైనదో నాకు తెలుసు. మనం కొట్టినం” అంటూ రష్మిక మందన్నా ట్విటర్‌లో రాసుకొచ్చింది.

కింగ్‌డమ్ సినిమాతో హిట్ కొట్టినం అనే అర్థంలో రష్మిక మందన్నా ట్వీట్ చేసింది. దీనికి రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా రిప్లై ఇచ్చాడు. రష్మిక చెప్పిన మాటనే “మనం కొట్టినం” అని బదులిచ్చాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం కింగ్‌డమ్ మూవీపై రష్మిక రివ్యూ, దానికి విజయ్ దేవరకొండ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెళ్లి ప్రశ్నలు

ఈ పోస్ట్‌కు నెటిజన్స్ నుంచి పలు విధాలుగా కామెంట్స్ వస్తున్నాయి. “మీరిద్దరు నిజంగా డేటింగ్ చేస్తున్నారా” అని ఓ యూజర్ అడిగాడు. “పెళ్లి ప్రకటన ఎప్పుడు” అని మరొకరు ప్రశ్నించారు. “వాట్సాప్ వాడండి ఎక్స్ కాదు” అని ఇంకొకరు కామెంట్ చేశారు. “ఇంకేంటీ ఆలస్యం మ్యారేజ్ డేట్ ఎప్పుడు” అని మరో యూజర్ అడిగారు.

ఇలా రష్మిక , విజయ్ ట్వీట్, రిప్లైలకు నెటిజన్స్ కామెంట్స్ డిఫరెంట్‌గా ఉంటూ అందరిని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి గీత గోవిందం, డియర్ కామ్రెడ్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. డియర్ కామ్రెడ్ సినిమా సమయం నుంచి వీరిద్దరి మధ్య డేటింగ్ రూమర్స్ జోరుగా ప్రచారం అందుకున్నాయి.

రష్మిక మందన్నా మరియు విజయ్ దేవరకొండల ట్వీట్లు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. వారిద్దరి భవిష్యత్తు గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.