|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

rashmika_mandanna: నాగార్జున సర్‌తో స్క్రీన్‌ను పంచుకోవడం పరిపూర్ణమైన రుచికర వంటకంలా అనిపిస్తుంది!

Published: 10-06-2025, 1:19 AM
rashmika_mandanna: నాగార్జున సర్‌తో స్క్రీన్‌ను పంచుకోవడం పరిపూర్ణమైన రుచికర వంటకంలా అనిపిస్తుంది!

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న తన తాజా చిత్రం ‘కుబేర’ ప్రమోషన్ల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో ఆమె అక్కినేని నాగార్జున, ధనుష్ తో కలిసి నటించింది.

Key Points

1

రష్మిక మందన్న త్వరలో విడుదల కానున్న 'కుబేర' చిత్రంలో నటిస్తున్నారు.

2

నాగార్జున గారు, ధనుష్ గారితో కలిసి రష్మిక నటించడం ఆమెకు ఎంతో ఆనందంగా ఉంది.

4

రష్మిక ఈ చిత్రాన్ని 'పరిపూర్ణమైన రుచికర వంటకం' అని అభివర్ణించింది.

రష్మిక మందన్న – కుబేర చిత్ర ప్రమోషన్లు

టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ 2014 లో మోడలింగ్ ప్రారంభించి.. అదే ఏడాదిలో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. క్లీన్ అండ్ క్లియర్ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా చేసింది. తర్వాత నేషనల్ క్రష్ కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

తర్వాత ఈ హీరోయిన్ పునీత్ రాజ్ కుమార్ సరసన అంజని పుత్ర, గణేష్‌కు జోడిగా ఛమక్ అనే మూవీల్లో అవకాశం కొట్టేసింది. నాగశౌర్యతో కలిసి ఛలో సినిమాలో అదర్భుతంగా నటించి.. తన క్యూట్‌నెస్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. తర్వాత ఈ భామ వరుస చిత్రాలతో అలరించింది.

దేవదాస్, గోత గోవిందం, యజమన, డియర్ కామ్రేడ్, భీష్మ, పొగరు, సుల్తాన్, పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు, సీతారామం, వారసుడు, మిషజ్ మజ్ను, యానిమల్, పుష్ప ది రూల్, ఛావా సికందర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన వ్యక్తిగత, వృత్తిపర విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటుందన్న విషయం తెలిసిందే.

నాగార్జునతో కలిసి పనిచేయడం గురించి రష్మిక అభిప్రాయం

అయితే తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న సోషల్ మీడియా వేదిక అయిన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్ట పెట్టింది. ఈ బ్యూటీ త్వరలో కుబేర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు.

ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, జిమ్ సర్భ్, రష్మిక కీలక పాత్రలో నటించారు. జూన్ 20, 2025న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని రష్మిక పంచుకుని.. ‘‘మేము చెన్నైలో మా కుబేర ప్రమోషన్‌లను ప్రారంభించాం. మీలో చాలా మందికి తెలిసినట్లుగా, చెన్నై నా బాల్యం కారణంగా నా హృదయంలో చాలా ప్రియమైన స్థానాన్ని కలిగి ఉంది. కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలా చెప్పినప్పటికీ.. ఆ రోజు నేను చాలా నవ్వాను.. ఓరి దేవుడా ఎంత అద్భుతమైన సాయంత్రం ఇది.

చెన్నైలో ‘కుబేర’ చిత్ర ప్రమోషన్ల ప్రారంభం

@dhanushkraja సర్, నాగార్జున సర్‌తో స్క్రీన్‌ను పంచుకోవడం @kammula.sekhar సర్ దర్శకత్వం వహించడం, @nikethbommi సర్‌తో కలిసి పని చేస్తున్నప్పుడు అండ్ @thisisdsp సంగీతం అందించడం.. మొత్తం దర్శకత్వ విభాగం, కెమెరా విభాగం, లైట్ విభాగం, అత్యంత అందమైన కాస్ట్యూమ్ విభాగం… ఇది మీ కోసం తయారు చేసిన పరిపూర్ణమైన రుచికర వంటకంలా అనిపిస్తుంది. జూన్ 20న విడుదలైనప్పుడు మీరు ఆ మ్యాజిక్‌ను అనుభవిస్తారని నేను ఆశిస్తున్నాను’’. అని ఈ హీరోయిన్ రాసుకొచ్చింది.

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

చివరగా, రష్మిక మందన్న ‘కుబేర’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. నాగార్జున గారితో కలిసి పనిచేసిన అనుభవం ఆమెకు ఎంతో ప్రత్యేకమైనది అని తెలుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.