|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రష్మిక ఆనందానికి అవధుల్లేవ్! గద్దర్ అవార్డుతో ఉప్పొంగిన నేషనల్ క్రష్!

Published: 20-03-2026, 9:35 AM
రష్మిక ఆనందానికి అవధుల్లేవ్! గద్దర్ అవార్డుతో ఉప్పొంగిన నేషనల్ క్రష్!
  • ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రానికి రష్మికకు ఉత్తమ నటిగా అవార్డు
  • హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో అవార్డు అందుకున్న రష్మిక
  • చిన్నప్పుడు రాష్ట్ర స్థాయి విజేతలను చూసి ఆశ్చర్యపోయేదాన్నన్న రష్మిక
  • ఇది ఆరంభం మాత్రమేనని రష్మిక ప్రకటన

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రానికి గాను ఆమెకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ఆమె తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

తెలంగాణ గద్దర్ అవార్డుల్లో రష్మిక

Rashmika Mandanna: మనం నమ్మకంగా చేసిన పనికి గుర్తింపు దక్కితే వచ్చే ఆనందమే వేరు. అలాంటి ఆనందాన్నే పొందుతున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna). అందులోనూ ఆమె ది బెస్ట్ ఫేజ్‌లో ఉన్నప్పుడు మంచి గుర్తింపు, గౌరవం రావడంతో.. నిజంగా ఆమె ఆనందానికి అవధులే లేవంటే నమ్మాలి. అదే విషయాన్ని తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend) చిత్రానికిగానూ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Telangana Gaddar Film Awards)లో ఆమె బెస్ట్ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో అవార్డును అందుకున్న రష్మిక స్టేజ్‌పైనే తన సంతోషాన్ని తెలియజేశారు. తాజాగా ఆమె మరోసారి ఈ అవార్డ్స్‌పై సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ.. చాలా గర్వంగా, సంతోషంగా ఉందని తెలిపారు.

‘‘నేను చిన్నప్పుడు ఎవరైనా రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిస్తే, వారిని సూపర్ స్టార్‌లుగా చూసేదాన్ని. వారు అది ఎలా సాధించారు? రోజంతా వారు ఏం చేస్తారు? ఇలాంటి విషయాల గురించి ఆలోచించేదాన్ని. నిన్న సాయంత్రం రాష్ట్ర స్థాయి అవార్డు అందుకోవడం నాకు చాలా ప్రత్యేకం. నాలోని ఆ అనుభూతిని మాటల్లో వివరించలేను కానీ, నేను చాలా దూరం ప్రయాణించి ఇక్కడికి చేరుకున్నానని అనిపిస్తోంది! నాలో ఒక రకమైన గర్వం, సంతోషం, సంతృప్తి కలిగాయి. ఈ ఏడాది ఇంత అద్భుతంగా ప్రారంభమవ్వడం, అందునా తెలంగాణలో రాష్ట్ర స్థాయి అవార్డుతో స్వాగతం లభించడం ఇంకా ప్రత్యేకంగా భావిస్తున్నాను. ఇందుకు గానూ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ టీమ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్‌కు కూడా థ్యాంక్యూ. దీనికి నేను ఎంతగానో కృతజ్ఞురాలిని! రాహుల్ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend) చిత్రాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు థాంక్యూ! నేను ఎప్పుడూ చెబుతుంటాను.. ఇది కేవలం ఆరంభం మాత్రమే! దీక్షిత్, అను ఇమ్మానుయేల్.. ఐ లవ్ యు గైస్!’’ అని రష్మిక తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆమె అందుకున్న అవార్డులతో పాటు దర్శకుడు రాహుల్‌తో ఉన్న ఫొటోలను ఆమె షేర్ చేశారు.

సోషల్ మీడియాలో రష్మిక స్పందన

ఇక అవార్డ్స్ ఫంక్షన్‌లో రష్మిక మాట్లాడుతూ.. ‘‘ఈ వేదిక సాక్షిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒకప్పుడు నా నటనపై ట్రోల్స్ వచ్చేవి. ఇప్పుడు నటిగా మెప్పించి, స్టేట్ నుంచి ఈ అవార్డును అందుకున్నాను. ఇది ఎప్పటికీ నా మనసులో గుర్తుండిపోతుంది. అందులోనూ ‘ది గర్ల్ ఫ్రెండ్’ వంటి చిత్రానికి అవార్డు రావడం చాలా చాలా స్పెషల్. ఎందుకంటే, ఇంకా ఇలాంటి ఎన్నో చిత్రాలు చేయడానికి నాకు కాన్ఫిడెంట్‌ని ఈ అవార్డు ఇచ్చింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాహుల్‌కి థ్యాంక్యూ చెబుతున్నాను, రష్మిక, భూమా (సినిమాలో రష్మిక పేరు) ఇద్దరూ.. నన్ను ఎంతగానో ప్రొటక్ట్ చేసిన రాహుల్‌కి థ్యాంక్స్ చెబుతున్నారు. ఇంకా ఈ సినిమాకు పనిచేసిన అందరికీ థ్యాంక్స్’’ అని చెప్పారు.

When I was young and someone had become a state level winner i would look at them as superstars. I’d be like how did they do what they did, what do they do through their days and stuff like that and last evening getting a state award was something extremely special to me.. I… pic.twitter.com/nQPqKLO8kY

రాష్ట్ర స్థాయి అవార్డుపై రష్మిక భావోద్వేగం

— Rashmika Mandanna (@iamRashmika) March 20, 2026

మొత్తానికి రష్మిక మందన్నకు రాష్ట్ర స్థాయి అవార్డు రావడం ఆమె అభిమానులకు సంతోషాన్ని కలిగించింది. ఇది ఆరంభం మాత్రమేనని ఆమె చెప్పడం మరింత ఉత్సాహాన్నిస్తోంది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.