|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: చిరంజీవి, బాబీ సినిమా ఆగిపోయిందా? అసలు ఏం జరిగింది?

Published: 16-02-2026, 11:05 PM
షాకింగ్: చిరంజీవి, బాబీ సినిమా ఆగిపోయిందా? అసలు ఏం జరిగింది?
  • మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమాను వృద్ధి సినిమాస్ నిర్మించనుంది.
  • విజయ్ దళపతి సినిమా ప్రభావంతో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది.
  • ఈ నెల చివరిలో సినిమా ప్రారంభోత్సవం జరగనుంది, ముహూర్తం ఖరారు చేశారు.
  • దర్శకుడు బాబీ, చిరంజీవి కోసం మాస్ యాక్షన్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు.

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న మెగా 158 చిత్రం కేవీఎన్ ప్రొడక్షన్స్ నుండి వృద్ధి సినిమాస్‌కు మారింది. విజయ్ సినిమా ప్రభావంతో ఈ మార్పు జరిగింది. సినిమా త్వరలో ప్రారంభం కానుంది.

మెగా 158 నిర్మాణంలో మార్పు

Mega 158: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో రాబోతున్న ‘మెగా 158’ చిత్రంపై తాజాగా ఒక కీలకమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుందని ప్రచారం జరిగినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ భారీ ప్రాజెక్ట్‌ను వృద్ధి సినిమాస్ (Vridhhi Cinemas) సంస్థ నిర్మించబోతోంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో, వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు సిద్ధమైంది. అయితే కేవీఎన్ ప్రొడక్షన్ లో ఈ సినిమా ఎందుక ఆగిపోయింది అన్నదానికి చాలా  అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా విజయ్ దళపతి ‘జననాయగన్’ ఎఫెక్ట్ వల్ల ఈ సినిమాను కేవీఎన్ నిర్మాతలు వదులుకున్నట్లు తెలుస్తుంది. జననాయగన్ విజయ్ చివరి సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అత్యంత భారీగా చేశారు. కానీ ఈ సినిమా ఇప్పటి వరకూ సెన్సార్ కారణంగా విడుదలకు నోచుకోలేదు. అందుకే ‘మెగా 158’ నిర్మాతలు మారినట్లు తెలుస్తోంది.

Read also- Suhas Interview: నువ్వు హీరోవా అన్న ప్రశ్నకు అదిరిపోయే సమాధానం చెప్పిన సుహాస్.. అంతేగా!

కేవీఎన్ ప్రొడక్షన్స్ ఎందుకు తప్పుకుంది?

ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సంబంధించి చిత్ర యూనిట్ ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల చివరలోనే (Month End) ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ కానుంది. పూజా కార్యక్రమాలతో సినిమాను అధికారికంగా ప్రారంభించి, ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు బాబీ ఈసారి కూడా మెగాస్టార్ కోసం ఒక పక్కా మాస్ యాక్షన్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. వింటేజ్ చిరంజీవిని గుర్తుకు తెచ్చేలా బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. వృద్ధి సినిమాస్ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి టెక్నీషియన్స్, ఇతర నటీనటుల వివరాలను ఓపెనింగ్ రోజున అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

సినిమా ప్రారంభోత్సవం ఎప్పుడు?

Read also- Podarillu Kesava: ‘పొదరిల్లు’ కేశవ బ్యాగ్రౌండ్ ఏంటి..?ఒక్కరోజు రెమ్యూనరేషన్?

మొత్తానికి మెగా 158 చిత్రం నిర్మాణ సంస్థ మారినా, సినిమా మాత్రం ఆగడం లేదు. త్వరలోనే ప్రారంభోత్సవం జరుపుకోనుంది. మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.