|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ దేవరకొండతో రష్మిక పెళ్లి నిజమెంత? పెదవి విప్పిన రష్మిక మందన్న! షాకింగ్ ట్విస్ట్!

Published: 20-01-2026, 12:00 AM
విజయ్ దేవరకొండతో రష్మిక పెళ్లి నిజమెంత? పెదవి విప్పిన రష్మిక మందన్న! షాకింగ్ ట్విస్ట్!
  • విజయ్ దేవరకొండ, రష్మికల మధ్య ప్రేమ చిగురించింది ‘గీతా గోవిందం’ సినిమాతో.
  • వీరిద్దరి నిశ్చితార్థం రహస్యంగా జరిగిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు.
  • ప్రేమికుల రోజున పెళ్లి వార్తలపై స్పందించిన రష్మిక.. సరైన సమయం కోసం వేచి ఉండాలన్నారు.
  • గత సంవత్సరం రష్మిక ఐదు చిత్రాలతో భారీ విజయాన్ని అందుకుంది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై రష్మిక స్పందిస్తూ త్వరలోనే అసలు విషయం తెలుపుతానని చెప్పింది. దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

విజయ్, రష్మికల ప్రేమ కథ ఎక్కడ మొదలైంది?

Rashmika Mandanna:’గీతా గోవిందం’ సినిమాతో జంటగా తెలుగు తెరకు పరిచయమయ్యారు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika mandanna). ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయిపోయారు. జంట అంటే ఇలాగే ఉండాలి అనేలా తమ అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అలాంటి ఈ జంట ఆ సినిమా సమయంలోనే పరిచయం ఏర్పడి ప్రేమించుకోవడం మొదలుపెట్టారు అనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ‘డియర్ కామ్రేడ్’ సినిమా వచ్చింది. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ మరింత బలపడిందంటూ అభిమానులు కూడా నిర్ధారణకు వచ్చేసారు. దీనికి తోడు ఇద్దరు కలిసి వెకేషన్ లకి వెళ్లడం.. రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపడం.. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి

అయితే ఆ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ గత ఏడాది రహస్యంగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ రష్మిక చేతి వేలికి ఉన్న డైమండ్ రింగు అలాగే విజయ్ దేవరకొండ చేతి వేలికి ఉన్న డైమండ్ రింగు వీరిద్దరికి నిశ్చితార్థం అయ్యింది అనే విషయాన్ని స్పష్టం చేశాయి.. ఇక ఇప్పుడు ఫిబ్రవరి నెలలో వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు రాగా దానిపై స్పందించింది రష్మిక మందన్న.

పెళ్లి రూమర్స్‌పై రష్మిక ఏమన్నారంటే?

ఇకపోతే ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజు సందర్భంగా ఈ జంట వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వస్తుండగా తాజాగా ఈ వార్తలపై స్పందించి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది రష్మిక మందన్న. “గత నాలుగు సంవత్సరాలుగా కొన్ని రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే సరైన సమయం వచ్చినప్పుడే దాని గురించి మాట్లాడుతాను. అప్పుడే మీ అందరికీ నిజం తెలుస్తుంది” అంటూ చెప్పింది. మొత్తానికైతే వచ్చే నెలలో వీరు పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రష్మిక ఇలాంటి కామెంట్లు చేయడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై రష్మిక ఏ విధంగా స్పందించబోతోంది అనే విషయం చర్చనీయాంశంగా మారింది.

రష్మిక సినీ కెరీర్ గురించి తెలుసా?

ఇకపోతే గత ఏడాది భాషతో సంబంధం లేకుండా ఏకంగా ఐదు చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకొని తన సినిమాలతో మూడు వేల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది రష్మిక. ప్రస్తుతం ‘మైసా’ అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుండి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా మేకర్స్ విడుదల చేశారు.

అటు విజయ్ దేవరకొండ కూడా ‘రౌడీ జనార్ధన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా నుండి విజయ్ ఫస్ట్ లుక్ ని కూడా ఇటీవల పంచుకున్న విషయం తెలిసిందే.ఈ రెండు చిత్రాలు ఒకేసారి విడుదలయితే గట్టి పోటీ ఉంటుందనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండకి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

మొత్తానికి రష్మిక పెళ్లి గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. సరైన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు తెలుపుతానని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.