
విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారనే వార్తలు గత కొంతకాలంగా వస్తున్నాయి. తాజాగా, రష్మిక తన కొత్త సినిమా ‘మైసా’ పోస్టర్‌కు విజయ్ ఇచ్చిన ప్రతిస్పందనకు ‘విజ్జూ’ అంటూ ముద్దుగా స్పందిస్తూ వారి సంబంధంపై మళ్ళీ చర్చను రేకెత్తించింది.
Key Points
రష్మిక, విజయ్ దేవరకొండతో ఉన్న ప్రేమ వ్యవహారంపై మరోసారి వార్తలు
‘మైసా’ సినిమా పోస్టర్‌కు విజయ్ స్పందనకు రష్మిక ఇచ్చిన ప్రతిస్పందన
‘విజ్జూ’ అంటూ ముద్దుగా పిలిచి ప్రేమ పుకార్లకు రూపం
రష్మిక ‘మైసా’ చిత్రంతో వారియర్ గా ప్రేక్షకులను అలరించబోతుంది
రష్మిక-విజయ్ ప్రేమ వ్యవహారం
విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ప్రేమలో ఉన్నారనే గాసిప్ గత కొనేళ్లుగా నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. వాటిపై ఇటు రష్మిక కానీ అటు విజయ్ కానీ స్పందించడం లేదు కానీ..‘అవును మేం ప్రేమలోనే ఉన్నాం’ అన్నట్లుగా అప్పుడప్పుడు హింట్ అయితే ఇస్తున్నారు. కలిసి ట్రిప్స్‌కి వెళ్తున్నార.. ఒకరి సినిమాపై ఒకరు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఏదైనా సినిమా ఈవెంట్స్‌లో ప్రేమ, పెళ్లి ప్రస్తావన వస్తే.. పరోక్షంగా తాము రిలేషన్‌లో ఉన్నట్లుగానే ఒప్పుకుంటున్నారు. ఒకే లొకేషన్స్ ఉన్న ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ..తమ లవ్ మ్యాటర్‌ని కొంచెం కొంచెం రిలీల్ చేస్తున్నారు. తాజాగా రష్మిక విజయ్‌కి ముద్దుగా కొత్త పేరుతో పిలిచి.. మరోసారి ప్రేమ పుకార్లకు ఆజ్యం పోసింది.
‘మైసా’ సినిమా పోస్టర్‌కు విజయ్ స్పందన
వారియర్‌గా రష్మిక.. ఇటీవల కుబేర చిత్రంలో ప్రేక్షకులను పలకరించిన రష్మిక..ఇప్పుడు మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే మైసా. రవ్రీంద పూలే దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో రష్మిక డిఫరెంట్ పాత్ర పోషిస్తుంది. తొలిసారి ఆమె వారియర్‌గా కనిపించబోతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. అందులో రష్మిక వారియర్ లుక్‌లో కనిపించి అందరిని సర్‌ప్రైజ్ చేసింది. చాలా మంది సినీ తారలు మైసా పోస్టర్ లుక్‌పై ప్రశంసలు కురిస్తూ.. రష్మికకి ఆల్ ది బెస్ట్ చుబుతున్నారు. అలా విజయ్ దేవరకొండ కూడా మైసా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘ఈ సినిమా అద్భుతంగా ఉండనుంది’ అని రాసుకొచ్చాడు.
రష్మిక ప్రతిస్పందన మరియు ప్రేమ పుకార్లు
విజ్జూ.. నువ్వు గర్వపడేలా చేస్తా విజయ్ పోస్ట్‌పై రష్మిక స్పందించింది. ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ.. ‘విజ్జూ.. ఈ సినిమాతో నువ్వు గర్వపడేలా చేయబోతున్నాను’ అంటూ రష్మిక రిప్లై ఇచ్చింది. విజయ్‌తో అలా ముద్దుగా విజ్జూ అని పిలవడంతో మరోసారి వీరి ప్రేమ వ్యవహారంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీలో విజయ్‌కి చాలా మంది హీరోయిన్లు స్నేహితులుగా ఉన్నప్పటికీ…ఎవరూ కూడా అలా పిలవలేదు. విజయ్‌తో రష్మికకు స్నేహానికి మించిన బంధం ఉంది కాబట్టే అలా ముద్దుగా పిలిచిందని చాలా మంది నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
రష్మిక మందన్నా ‘మైసా’ సినిమాతో విజయ్ దేవరకొండను గర్వపడేలా చేస్తానని చెప్పడంతో వారి ప్రేమ వ్యవహారంపై మరోసారి చర్చ మొదలైంది. ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది.


