
నటి రష్మిక మందన తనపై వస్తున్న వివిధ రూమర్స్‌పై తాజాగా స్పందించారు. విజయ్ దేవరకొండతో ఎంగేజ్‌మెంట్, థామా సినిమా నిషేధం, ‘కాంతార’ చిత్రంపై స్పందించకపోవడం వంటి అంశాలపై ఆమె వివరణ ఇచ్చారు. “ప్రతి విషయాన్ని ఆన్‌లైన్‌లో పంచుకోలేను” అని రష్మిక అన్నారు.
Key Points
రష్మిక కెరీర్, వ్యక్తిగత జీవితంపై పలు పుకార్లు, ముఖ్యంగా విజయ్ దేవరకొండతో ఎంగేజ్‌మెంట్‌పై వార్తలు.
కన్నడ ఇండస్ట్రీ 'థామా' చిత్రాన్ని బ్యాన్ చేసిందని వచ్చిన వార్తలను రష్మిక ఖండించారు.
'కాంతార' చిత్రంపై స్పందించకపోవడంపై వివరణ ఇస్తూ, సినిమా చూసి బృందాన్ని అభినందించినట్లు తెలిపారు.
ప్రతి విషయాన్ని ఆన్‌లైన్‌లో పంచుకోలేనని, ప్రజల అభిప్రాయాలను పట్టించుకోనని రష్మిక స్పష్టం చేశారు.
రూమర్స్‌పై రష్మిక క్లారిటీ
ఈ మధ్య రష్మిక(Rashmika Mandanna ) పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ఒకపక్క కెరీర్..మరోపక్క పర్సనల్ విషయాల్లో రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి.ఇటీవల విజయ్ దేవరకొండతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. మరోవైపు రష్మిక నటించిన తాజా చిత్రం ‘థామా’(Thama)ని కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసినట్లు పుకార్లు వచ్చాయి. అక్టోబర్ 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అ
అయితే రష్మిక సొంత రాష్ట్రం అయిన కర్ణాటకలో మాత్రం విడుదల కాదని.. కన్నడ ఇండస్ట్రీ ఆమెను బహిష్కరించిందనే వార్తలు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై రష్మిక స్పందించింది. ఇప్పటివరకు తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని వెల్లడించింది. అపార్థం చేసుకోవడం వల్లే ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తాయని ఆమె అన్నారు .
“కాంతార”పై స్పందించకపోవడానికి కారణం
ప్రతి విషయాన్ని ఆన్‌లైన్‌లో పంచుకోలేను కన్నడ చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. రిషబ్ శెట్టిని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ అదే ప్రాంతానికి చెందిన రష్మిక మాత్రం ఈ చిత్రంపై స్పందించలేదు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. తాజాగా దీనిపై రష్మిక స్పందించింది.
వ్యక్తిగత విషయాలపై రష్మిక అభిప్రాయం
థామా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ..‘ఏ సినిమా రిలీజ్ అయినా..నేను రెండు, మూడు రోజుల్లోనే చూడలేను. కాంతార కూడా విడుదలైన కొన్ని రోజుల తర్వాత చూశాను. చిత్రబృందాన్ని అభినందిస్తూ మెసేజ్ కూడా చేశా. వాళ్లు నాకు ధన్యవాదాలు కూడా తెలిపారు. తెర వెనుక ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. మన వ్యక్తిగత విషయాలన్నీ కెమెరా ముందుకు తీసుకురాలేం కదా. ప్రతి విషయాన్ని ఆన్‌లైన్‌లో పంచుకునే వ్యక్తిని కాదు. . అందుకే ప్రజలు ఏమనుకున్నా పట్టించుకోను. వాళ్లు నా నటన గురించి ఏం మాట్లాడతారు అనేదే నాకు ముఖ్యం. దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాను’ అని రష్మిక అన్నారు.
మొత్తంగా, రూమర్స్‌పై రష్మిక స్పందన ఆమె వ్యక్తిత్వాన్ని, వృత్తి పట్ల నిబద్ధతను తెలియజేస్తుంది. ఆన్‌లైన్ వ్యాఖ్యలను పట్టించుకోకుండా తన నటనపైనే దృష్టి సారిస్తానని ఆమె అన్నారు. ఇది ఆమె అభిమానులకు స్పష్టతనిచ్చింది.


