
తెలుగులో బ్లాక్‌బస్టర్ అయిన ‘అరుంధతి’ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీలీలను ప్రధాన పాత్ర కోసం పరిశీలిస్తుండగా, నెటిజన్లు మాత్రం ఆ పాత్రకు రష్మిక మందన్నా అయితేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. రష్మిక బాలీవుడ్ విజయాలు ఇందుకు కారణం.
Key Points
తెలుగు బ్లాక్‌బస్టర్ “అరుంధతి” సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
శ్రీలీలతో ఈ రీమేక్ ప్లాన్ చేయగా, నెటిజన్లు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
అనుష్క రాజసానికి శ్రీలీల సరిపోదని, రష్మిక అయితేనే బెటర్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
రష్మిక మందన్నా ఇటీవల బాలీవుడ్‌లో సాధించిన విజయాలు, మార్కెట్ ఆమెకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి.
బాలీవుడ్‌లో అరుంధతి రీమేక్ ప్రణాళికలు
Rashmika-Sreeleela: సినిమా ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలు చేయడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఒక భాషలో హిట్ ఐన సినిమాను మరో భాషలో చేస్తూ ఉంటారు. కానీ, ఈ మధ్య పాన్ ఇండియా లెవల్లో సినిమాలు విడుదల అవుతున్నాయి కాబట్టి, రీమేక్స్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ (Rashmika-Sreeleela)చూపించడం లేదు. అలాగే, కొన్ని క్లాసికల్ హిట్స్ ఉంటాయి. అలాంటి వాటిని రీమేక్ చేయకపోవడమే బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే, ఆ సినిమాలో మ్యాజిక్ రిపీట్ కాకపోతే హిట్ అవడం పక్కన పడితే దారుణమైన ట్రోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు, ఇప్పుడు అలాంటి క్లాసికల్ హిట్ నే రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు బాలీవుడ్ మేకర్స్. ఆ రీమేక్ మరేదో కాదు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన “అరుంధతి”.
Chikiri-Kissik: పెద్ది దెబ్బకు పుష్ప 2 అవుట్.. ‘చికిరి’ సాంగ్ సరికొత్త రికార్డ్స్.. వేట మొదలు..
శ్రీలీల ఎంపికపై నెటిజన్ల అభ్యంతరాలు
లేడీ సూపర్ స్టార్ అనుష్క హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. అరుంధతి, జేజమ్మగా అనుష్క రాజసం సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. అలాంటి సినిమాను ఇంతకాలానికి బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కూడా లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీలతో. ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై నెగిటీవ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అరుంధతి లాంటి సినిమాకి అనుష్కలా హైట్, పర్సనాలిటీ ఉన్నా స్టార్ అయితేనే ఆ రాజసం ఉట్టిపడుతుంది. కానీ, శశ్రీలీల అనుష్కలో సగం కూడా ఉండదు.
రష్మిక మందన్నాకు ఎందుకు ప్రాధాన్యత?
కాబట్టి, శ్రీలీల ఆ సినిమా చేస్తే వేస్ట్ ఆఫ్ టైం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ చేసిన కూడా రష్మిక మందన్నా బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారు. ఎందుకంటే, ఈమధ్య కాలంలో బాలీవుడ్ లో రష్మిక మందన్నా క్రేజ్ బాగా పెరిగింది. ఆమె నటించిన సినిమాలు అక్కడ బాగా ఆడుతున్నాయి. యానిమల్ సినిమా ఏకంగా రూ.910 కోట్లు కలెక్ట్ చేయగా.. ఇటీవల విడుదలైన థామా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కూడా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో, ఆమెకు మంచి మార్కెట్ ఏర్పడింది. కాబట్టి, అలాంటి సినిమాను శ్రీలీల కంటే రష్మికతో చేస్తే బాగుంటుందని బాలీవుడ్ మీడియా కామెంట్స్ చేస్తుంది. మరి ఈ కామెంట్స్ ను అరుంధతి రీమేక్ మేకర్స్ ఫాలో అవుతారా.. లేదా అనేది చూడాలి.
అరుంధతి రీమేక్‌పై బాలీవుడ్ మేకర్స్ శ్రీలీల లేదా రష్మికలలో ఎవరిని ఎంపిక చేసుకుంటారో వేచి చూడాలి. ఈ కామెంట్లను వారు ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటారో ఆసక్తికరంగా మారింది.


