|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రేపే రష్మిక, విజయ్ పెళ్లి? ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ ఏర్పాట్లు! వైరల్ వీడియో!

Published: 01-02-2026, 5:05 AM
షాకింగ్: రేపే రష్మిక, విజయ్ పెళ్లి? ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ ఏర్పాట్లు! వైరల్ వీడియో!
  • విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి ఫిబ్రవరి 2న ఉదయ్‌పూర్‌లో జరగనున్నట్లు సమాచారం – వేడుకకు భారీ ఏర్పాట్లు!
  • గత ఏడాది అక్టోబర్ 3న వీరి నిశ్చితార్థం జరిగిందని సమాచారం – కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారని టాక్!
  • 2018లో ‘గీత గోవిందం’, ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట.
  • విజయ్, రష్మికల పెళ్లి వార్తలపై వారి సన్నిహిత వర్గాలు కొట్టిపారేస్తున్నాయి – ఇప్పట్లో పెళ్లి లేదంటున్నాయి!

టాలీవుడ్ మోస్ట్ లవ్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. వీరి వివాహం ఫిబ్రవరి 2న జరగనుందని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఫిబ్రవరి 2న పెళ్లి వేడుక?

టాలీవుడ్ లో భారీ క్రేజ్ ఉన్న కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా. వీరు గదా ఐదారేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు బయటకు తెలిసిన రహస్యమే. అయితే గతేడాది వీరికి కొద్దిమంది సమక్షంలోనే నిశ్చితార్థం కూడా అయిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని వీరిద్దరూ కూడా ఖండించలేదు. అలాగని బయటకి చెప్పలేదు. కాగా ఫిబ్రవరిలోనే వీరి పెళ్లికూడా జరగబోతున్నట్టు వార్తలు వచ్చాయి. రష్మికని ఇదే విషయం ఎన్నిసార్లు అడిగినా కూడా మీడియా నుంచి తప్పించుకుంది. కానీ అసలు విషయం చెప్పలేదు. అయితే వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 2న జరగబోతున్నట్టు ఇప్పుడు ఒక వీడియో ద్వారా తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు.

అందుతున్న సమాచారం ప్రకారం రాజస్థాన్లోని ఉదయపూర్ సిటీ ప్యాలెస్ లో విజయ్, రష్మిక పెళ్లికి భారీ స్థాయిలో డెకరేషన్ జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో ఇద్దరమ్మాయిలు డెకరేషన్స్ ను చూపిస్తున్నారు. ఇక్కడే ఫిబ్రవరి 2న విజయ్ – రష్మికల వివాహం జరగబోతుందని వారు చెప్పారు. భారీ వేదిక, పూల అలంకరణలతో ఏదో పెద్ద వేడుక జరగబోతున్నట్టు ఈ ఏర్పాట్లను చూస్తే అర్థమయిపోతుంది.

ఉదయ్‌పూర్‌లో భారీగా ఏర్పాట్లు!

A post shared by Mamaraazzi (@mamaraazzi)

గత ఏడాది అక్టోబర్ మూడున హైదరాబాదులో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే రష్మిక, విజయ్ నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచే ఫిబ్రవరిలో పెళ్లి అనే వార్తలు కూడా వచ్చాయి. పెళ్లి చాలా వ్యక్తిగతంగా వారు భావించారు. అందుకే అందరినీ కాకుండా కేవలం సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఉదయ్ పూర్లో పెళ్లి చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 2న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లితో ఒకటవబోతున్నారని సమాచారం. 2018లో వచ్చిన గీత గోవిందంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటి నుంచే వీరి మధ్య ఏదో మొదలైంది అనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ చిత్రంలో మళ్లీ కలిసి నటించడంతో ఇద్దరూ ప్రేమలో కూరుకుపోయారని తెలిసింది.

సన్నిహిత వర్గాల ఖండన!

విజయ్ దేవరకొండ, రష్మిక సన్నిహిత వర్గాలు చెబుతున్న ప్రకారం ఇవన్నీ వదంతులేనని, ఇప్పట్లో పెళ్లి లేదని మరి కొద్ది రోజులు ఆగాలని చెబుతున్నారు. ఏది నిజమో మాత్రం రేపటితో తెలిసిపోతుంది. ఏదేమైనా ఫిబ్రవరిలో ఏదో ఒకరోజు మాత్రం వీరి పెళ్లి ఉంటుందని మాత్రం తెలుస్తోంది. కానీ వీరిద్దరూ సినిమా షూటింగులలో చాలా బిజీగా ఉన్నారు.

విజయ్, రష్మిక పెళ్లి వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.