
📌 Key Points
- రష్మిక కెరీర్‌లోనే ‘సికందర్’ బిగ్గెస్ట్ డిజాస్టర్ అని సంచలన ప్రకటన!
- మురుగదాస్ చెప్పిన కథ వేరు.. తెరపై చూసింది వేరంటూ రష్మిక షాకింగ్ కామెంట్స్!
- సల్మాన్, రష్మిక కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదన్న నెటిజన్లు, ట్రోల్స్ మీమ్స్ వైరల్
- బాలీవుడ్, టాలీవుడ్‌లో రష్మిక కామెంట్స్‌పై చర్చలు.. దుమారం రేపుతున్న సికందర్ టాక్!
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న నటించిన సికందర్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలను రష్మిక స్వయంగా వెల్లడించింది. ఆ వివరాలేంటో చూద్దాం!
సికందర్ ఫ్లాప్‌పై రష్మిక షాకింగ్ రియాక్షన్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) పుష్ప-2, చావా,వంటి చిత్రాలతో వరుస హిట్స్ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ దక్కించుకుంది. కానీ గత ఏడాది నటించిన ‘సికందర్’ (Sikandar)మాత్రం ఆమె కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా పలు విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఇందులో సల్మాన్, రష్మిక మధ్య కెమిస్ట్రీ అంతగా ఆకట్టుకోకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన సంగతి తెలిసిందే. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఈ సినిమా ఫ్లాన్ కావడంపై స్పందించింది.
మురుగదాస్ కథ మార్చేశారా?
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో నటించాలని తాను తీసుకున్న నిర్ణయం గురించి రష్మిక మాట్లాడుతూ.. సినిమా సెట్స్‌పైకి వెళ్లాక చాలా మార్పులు జరిగాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దర్శకుడు మురుగదాస్ తనకు చెప్పిన కథకు, చివరకు తెరపైకి వచ్చిన చిత్రానికి చాలా తేడా ఉందని రష్మిక పేర్కొంది. ‘‘నేను మురుగదాస్ సార్ దగ్గర కథ విన్నప్పుడు అది నిజంగా చాలా బాగుంది, కానీ తర్వాత జరిగినది మాత్రం పూర్తిగా భిన్నం. సాధారణంగా సినిమాల్లో ఇది జరుగుతుంటుంది.
సల్మాన్ – రష్మిక కెమిస్ట్రీపై ట్రోల్స్!
విన్నప్పుడు ఒక కథలా ఉంటుంది, కానీ మేకింగ్, ఎడిటింగ్, నటీనటుల పర్ఫార్మెన్స్ బట్టి విడుదల సమయానికి చాలా మార్పులు జరుగుతాయి. ‘సికందర్’ విషయంలో కూడా అదే జరిగింది. అందుకే అలాంటి ఫలితం వచ్చి ఉంటుంది’’ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు మాత్రం ఈ సినిమా ఫ్లాప్ కావడంపై భిన్నంగా స్పందిస్తున్నారు. కథ మారినా మారకపోయినా, సల్మాన్-రష్మిక మధ్య కెమిస్ట్రీ అస్సలు కుదరలేదని, ఇలాంటి డిజాస్టర్‌ను ఏ కథా కాపాడలేదని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ కామెంట్స్ బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
సికందర్ మూవీ ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలను రష్మిక బయటపెట్టడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. మరిన్ని టాలీవుడ్ అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


