
📌 Key Points
- యాంకర్ రష్మి గౌతమ్ వైసీపీ నేత నిరసనపై ఘాటు వ్యాఖ్యలు.
- ఎద్దుల బండిపై ఆటో నిరసన – జంతువులకు తీవ్ర ఇబ్బందులు.
- రష్మి “అదే గతి పడుతుంది” అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్.
- పెటా ఇండియా, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ దృష్టికి తీసుకెళ్లిన రష్మి.
టాలీవుడ్ యాంకర్ రష్మి గౌతమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. వైసీపీ నేత చేపట్టిన వినూత్న నిరసనపై రష్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. జంతువుల పట్ల క్రూరత్వంపై ఆమె వ్యక్తం చేసిన ఆగ్రహం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే చదవండి!
రష్మి ఆగ్రహానికి కారణం ఏంటి?
ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలోనే వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి మూడు రోజుల క్రితం తిరుపతిలో వినూత్నరీతిలో నిరసన తెలిపారు. పెట్రోల్, డీజిల్ కొరత వల్ల ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆటోను ఎడ్లబండిపై ఎక్కించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆ ఆటోలో మనుషులు ఉండటంతో పాటు, ఎడ్లబండిపై కూడా మనుషులు కూర్చున్నారు. దీంతో ఆ ఎద్దులు మోయలేక ఇబ్బందిపడ్డాయి.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు, టీడీపీ సపోర్టర్స్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎద్దులపై ఆటోను ఎక్కించడానికి బద్ది ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జంతు ప్రేమికురాలు, యాంకర్ రష్మి కూడా వీడియోపై ఘాటుగా స్పందించారు. దానిపై ఎక్కిన వాళ్లందరికీ అదే గతి పట్టాలని, ఆ ఎద్దు పడ్డ ఆవేదన ఈ మనుషులపై వెయ్యి రెట్లు ఎక్కువగా పడాలని పేర్కొంది. పెటా ఇండియా, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా దయచేసి ఈ విషయాన్ని పరిశీలించాలని, కఠినమైన నిబంధనలు ఆంక్షలు అమలు చేయాల్సిన సమయం వచ్చిందని తెలిపింది. రెండు రోజుల క్రితం 40 హస్కీలను చంపేశారని, అసలు ఎవరిదీ బాధ్యత అంటూ మండిపడింది.
వైసీపీ నేత నిరసన – జంతువులపై క్రూరత్వం!
నెటిజన్ల మద్దతు – కఠిన చర్యలకు డిమాండ్!
యాంకర్ రష్మి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జంతు సంరక్షణపై ఆమె చేసిన పోరాటానికి భారీ మద్దతు లభిస్తోంది. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం వేచి చూడండి!


