|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కులం చూసి దూరం చేశారు! 3 సినిమాలపై రవి కృష్ణ షాకింగ్ వ్యాఖ్యలు

Published: 28-12-2025, 8:50 AM
కులం చూసి దూరం చేశారు! 3 సినిమాలపై రవి కృష్ణ షాకింగ్ వ్యాఖ్యలు
  • రవి కృష్ణ ‘మొగలిరేకులు’ సీరియల్, బిగ్ బాస్ ద్వారా సుపరిచితుడు.
  • ‘దండోరా’ సినిమా సక్సెస్ తర్వాత ఇండస్ట్రీలోని కుల వివక్షపై సంచలన వ్యాఖ్యలు.
  • పేరు పక్కన కుల సూచికలు చూసి 3 సినిమాల అవకాశాలు కోల్పోయానని వెల్లడి.
  • నిజజీవితంలో, సినీ పరిశ్రమలో కుల వివక్షత ఇప్పటికీ ఉందని ఆవేదన వ్యక్తం.

బుల్లితెర నటుడు రవి కృష్ణ తాజాగా సినీ ఇండస్ట్రీలో కుల వివక్షపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘దండోరా’ సినిమా విజయం తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో, పేరు పక్కన కుల సూచికలు చూసి తనను 3 సినిమాల నుంచి తొలగించారని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

రవి కృష్ణ కెరీర్, ‘దండోరా’ సక్సెస్

Ravi Kirshna: రవి కృష్ణ పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర నటుడిగా అందరికీ ఎంతో సుపరిచితమైన రవి కృష్ణ ప్రస్తుతం వెండితెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. మొగలిరేకులు సీరియల్ ద్వారా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న రవి కృష్ణ అనంతరం బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అలాగే బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని అక్కడ కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకున్న రవి కృష్ణ ప్రస్తుతం సినిమాల పరంగా బిజీగా ఉన్నారు. విరూపాక్ష సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన తాజాగా దండోరా (Dandora)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

మురళి కాంత్ దర్శకత్వంలో నవదీప్, శివాజీ ,బిందు మాధవి వంటి తదితరులు నటించిన ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది .ఇక ఈ సినిమాలో రవి కృష్ణ కీలక పాత్రలో సందడి చేశారు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రసారమవుతున్న నేపథ్యంలో రవి కృష్ణ సైతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఇండస్ట్రీలో ఉన్న కుల వివక్షత గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

సినిమా అవకాశాలపై కుల వివక్ష!

దండోరా సినిమాలో కూడా గ్రామీణ నేపథ్యంలో కుల వివక్షత గురించి ప్రేక్షకుల ముందుకు రావడంతో నిజజీవితంలో జరిగిన సంఘటనల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు కుల వివక్షత ఉండేది కానీ, ఈ విధానం మారుతుందనకున్నాను. ఇప్పటికీ కూడా కులం విషయంలో ఎలాంటి మార్పులు రాలేదని రవి కృష్ణ తెలిపారు. ఇండస్ట్రీలో కూడా ఇలాంటి వివక్షత ఉందని తెలియజేశారు. కెరియర్ మొదట్లో నేను ఆడిషన్స్ కోసం వచ్చి నా డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు పేరు పక్కన తోకలు ఉండడం చూసి నాకు మూడు సినిమాలలో అవకాశాలు లేకుండా చేశారని తెలిపారు.

కాంట్రవర్సీలకు నేను దూరం..

కాంట్రవర్సీలకు రవి కృష్ణ దూరం?

నా పూర్తి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నా పేరు చూసి సినిమాల నుంచి రిజెక్ట్ చేసేవారు .ఏవేవో కారణాలు చెప్పి సినిమాల నుంచి తప్పించారని రవి కృష్ణ తెలియజేశారు. మరి ఈ అంశం గురించి మీ అభిప్రాయాలను తెలియజేస్తారా అంటూ ప్రశ్న ఎదురవడంతో ఇంకా తాను అంతా పెద్దవాడిని కాలేదని మామూలుగానే తాను కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాను అంటూ రవి కృష్ణ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా కులం కారణంగానే సినిమాల నుంచి తప్పించారని చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త సంచలనంగా మారాయి. అయితే ఇదివరకు ఇండస్ట్రీలో ఉన్న కుల వివక్షత గురించి ఎంతోమంది సెలబ్రిటీలు కూడా మాట్లాడిన సంగతి తెలిసిందే.

ఏది ఏమైనా, కులం కారణంగా సినిమా అవకాశాలు కోల్పోయానని రవి కృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కుల వివక్షపై మరోసారి చర్చకు దారితీశాయి. తాను కాంట్రవర్సీలకు దూరంగా ఉంటానని చెప్పినా, ఆయన చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.