|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ravi Teja Mass Jathara:‍ ‘రవితేజ సినిమానే కార్తీ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్’

Published: 28-10-2025, 1:24 PM
Ravi Teja Mass Jathara:‍ 'రవితేజ సినిమానే కార్తీ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్'

మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రవితేజపై ప్రశంసలు కురిపిస్తూ, ‘విక్రమార్కుడు’ కార్తీ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అని సూర్య అన్నారు. ఈనెల 31న సినిమా విడుదల కానుంది.

Key Points

1

రవితేజ 'మాస్ జాతర' సినిమా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

2

ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

4

కార్తీ కెరీర్‌లో 'విక్రమార్కుడు' సినిమా టర్నింగ్ పాయింట్ అని సూర్య పేర్కొన్నారు.

మాస్ జాతర: విడుదల వివరాలు

మాస్ మహారాజా రవితేజ మరో ఫుల్‌ యాక్షన్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు . ఆయన నటించిన మాస్ జాతర ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది . ఇప్పటికే ట్రైలర్ ‌ రిలీజ్ ‌ చేయగా .. రవితేజ యాక్షన్ ‌, డైలాగ్ ‌ మాస్ ఆడియన్స్ ‌ ను అలరిస్తున్నాయి. ఈ మూవీని భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ధమాకా లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత శ్రీలీల మరోసారి రవితేజ సరసన కనిపించనుంది. ఈ మూవీ కోసం మాస్‌ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు .

ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సూర్య సందడి

రిలీజ్ ‌ కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్స్ ‌ తో బిజీగా ఉన్నారు మేకర్స్ . ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ‌ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ‌ నిర్వహించారు . ఈ ఈవెంట్ ‌ కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఈవెంట్ ‌ లో పాల్గొన్న హీరోయిన్ ‌ శ్రీలీల తన డ్యాన్స్ ‌ తో మరోసారి ఆడియన్స్ ‌ ను అలరించింది . రవితేజతో కలిపి స్టెప్పులతో అదరగొట్టేసింది . ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు .

కార్తీ కెరీర్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

హీరో సూర్య మాట్లాడుతూ ..’ రవితేజకు నేను కూడా అభిమానినే . ఇది నాకు ఫ్యాన్ ‌ భాయ్ ‌ మూమెంట్ . ఆయన ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . రవితేజ నటనకు బిగ్ ఫ్యాన్ ‌ నేను . తమిళంలోనూ రవితేజ సినిమాలకు అద్భుతమైన క్రేజ్ ‌ ఉంది . విక్రమార్కుడు మూవీ కార్తీ కెరీర్‌లో బిగ్ టర్నింగ్‌ పాయింట్. ఈ మాస్ ‌ జాతర సూపర్ ‌ హిట్ ‌ కావాలని కోరుకుంటున్నా . ఈ మూవీలో నటించిన అందరికీ ఆల్ ది బెస్ట్ ‌. డైరెక్టర్ ‌ భాను ‍ కల నిజం కావాలి . ఈనెల 31 మరో బ్లాక్ ‌ బస్టర్ ‌ చూడబోతున్నాం ‘ అని అన్నారు . కాగా .. రవితేజ , శ్రీలీల జంటగా వస్తోన్న మాస్ జాతర అక్టోబర్ ‌ 31 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది .

రవితేజ, శ్రీలీల జంటగా వస్తున్న ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న థియేటర్లలో సందడి చేయనుంది. సూర్య ప్రశంసలు, అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా విజయం సాధించాలని చిత్ర బృందం ఆశిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.