|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రవితేజ ‘RT-76’ అప్డేట్‌పై మేకర్స్ పోస్ట్.. టైటిల్ లీక్ కావడంతో ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

Published: 09-11-2025, 11:10 PM
రవితేజ ‘RT-76’ అప్డేట్‌పై మేకర్స్ పోస్ట్.. టైటిల్ లీక్ కావడంతో ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘RT-76’ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా మేకర్స్ ఇచ్చిన అప్డేట్‌లో అనుకోకుండా టైటిల్ లీక్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ‘భక్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్ లీక్ కావడంతో ఫ్యాన్స్ స్పందన ఆసక్తికరంగా ఉంది.

Key Points

1

రవితేజ 'RT-76' సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు, SLV సినిమాస్ నిర్మిస్తోంది.

2

నవంబర్ 10న సాయంత్రం 3:33 గంటలకు RT-76 టైటిల్, గ్లింప్స్ విడుదల కానున్నాయి.

4

'మాస్ జాతర'లా వాయిదాలు కాకుండా RT-76 వేగంగా విడుదల కావాలని రవితేజ ఫ్యాన్స్ కోరుతున్నారు.

RT-76పై మేకర్స్ అప్డేట్

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) ఇటీవల ‘మాస్ జాతర’ చిత్రంతో వచ్చాడు. పలు వాయిదాల తర్వాత అక్టోబర్ 31న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం హిట్ అందుకోలేకపోయింది. ఊహించని విధంగా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రవితేజ ‘RT -76’ సినిమాతో రాబోతున్నారు. కిషోర్ తిరుమల(Kishore Tirumala) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ బ్యానర్‌పై సూధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో ఆషిక రంగనాథ్(Ashika Ranganath), డింపుల్ హయాతీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. ఈ చిత్రానికి పలు టైటిల్స్ పెట్టే ప్లాన్‌లో మేకర్స్ ఫుల్ బిజీ అయిపోయినట్లు పలు వార్తలు వచ్చాయి.

తాజాగా, ఈ విషయంపై చిత్రబృందం ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్, గ్లింప్స్ నవంబర్ 10న 3:33గంటలకు విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. అలాగే ఓ వైట్ బోర్డ్‌కు ఆనుకుని నిల్చున్న రవితేజ పోస్టర్‌ను షేర్ చేసి పప్పులో కాలేశారు. ఇందులో టైటిల్ క్లియర్‌గా అర్థమవుతోంది. ‘RT-76’ సినిమాకు ‘భక్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు హింట్ ఇచ్చారు. కవర్ చేసినప్పటికీ అనుకోకుండా లీక్ అయిపోయింది. దీంతో అది చూసిన రవితేజ ఫ్యాన్స్ ఈ చిత్రం కూడా 8మాస్ జాతర’లా వాయిదాలు వేయరుగా అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

‘భక్త మహాశయులకు విజ్ఞప్తి’ టైటిల్ లీక్

రవితేజ ఫ్యాన్స్ స్పందన

మొత్తంగా, ‘RT-76’ టైటిల్ లీక్ అవ్వడం సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. నవంబర్ 10న అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ లీక్ చిత్ర బృందానికి ఊహించని ప్రచారం కల్పించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.