|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రీ రిలీజ్ ఈవెంట్: హైదరాబాద్‌లో సందడి! విడుదల తేదీ ఖరారు!

Published: 09-01-2026, 7:15 AM
రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ప్రీ రిలీజ్ ఈవెంట్: హైదరాబాద్‌లో సందడి! విడుదల తేదీ ఖరారు!
  • రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ జనవరి 13న విడుదల కానుంది.
  • జనవరి 10న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది.
  • సినిమా ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
  • సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలతో పోటీ పడనుంది.

రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

భారీగా ప్రీ రిలీజ్ వేడుక ఏర్పాట్లు

BMW Pre Release: రవితేజ హీరోగా కిషోర్ తిరుమల(Kishore Tirumala) దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి(BharthaMahasayulakuWignyapthi). ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ (Pre Release)వేడుకకు సంబంధించి చిత్ర బృందం అధికారక ప్రకటన వెల్లడించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని ఐటిసి కోహినూరులో ఎంతో ఘనంగా జరగబోతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం అధికారకంగా పోస్టర్ విడుదల చేశారు.

ఈ సినిమా విడుదలకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే ఇటీవల సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచింది. అలాగే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు కూడా సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో రవితేజ(Raviteja)కు జోడిగా ఆశిక రంగనాథ్(Ashika Ranganath), డింపుల్ హయతి(Dimple hayathi) హీరోయిన్లుగా నటించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పైన రవితేజ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

గత కొంతకాలంగా రవితేజ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. దీంతో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్నప్పటికీ కంటెంట్ పై ఉన్న నమ్మకంతో రవితేజ కూడా సంక్రాంతి బరిలో దిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .మరి ఈ సినిమా రవితేజకు ఎలాంటి సక్సెస్ అందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

సినిమాపై అంచనాలు పెంచిన ట్రైలర్

#BharthaMahasayulakuWignyapthi Grand Pre-release Event on 10th January from 6 PM onwards 🔥🥳

📍ITC Kohenur, Hyderabad ❤‍🔥

Book your free passes here ⬇️ 🔗 https://t.co/keFNAx6l08 #BMWTrailer TRENDING TOP on YouTube 🔥🔥🔥 ▶️ https://t.co/9bV1T94HqA #BMW GRAND RELEASE… pic.twitter.com/2B6xyumEIt

సంక్రాంతి బరిలో రవితేజ

— SLV Cinemas (@SLVCinemasOffl) January 9, 2026

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన అప్డేట్ రావడంతో అభిమానులు కూడా ఈ వేడుకలో భాగం అవ్వడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో పాటు డైరెక్టర్ బాబి కూడా హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. రవితేజ కూడా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎంతో బిజీగా ఉన్నారు. మాస్ జాతరతో ప్రేక్షకులను నిరాశపరిచిన మరో ఎంటర్టైనర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేసాయి. ఈ సినిమాకు ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా రవితేజకు మంచి విజయాన్ని అందిస్తుందా లేదా వేచి చూడాలి. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.